ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ బందోబస్తు ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐపిఎస్ గారు స్వయంగా పరిశీలించారు. సరూర్ నగర్ స్టేడియంలోని కౌంటింగ్ రూమ్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ భద్రతను కూడా పరిశీలించారు.
లెక్కింపు ప్రక్రియ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని, వారికి సహకరిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. JCP సత్యనారాయణ ఐపియెస్, ఎస్ ఒ టీ డీసీపీ మురళీధర్, డీసీపీ ఎల్బి నగర్ సాయి శ్రీ, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, ఏసీపి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి మరియు ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.