Tirumala Tirupathi Devasthanam, Gir Govulu, Gir Cows, TTD, Tirupathi Go Samrakshana Shala, K Shiva Kumar, Yuga Tulasi Foundation, Telugu World Now,
BHAKTHI NEWS: గోవిందుని సన్నిధికి “గిర్ గోవులు”
శ్రీవారి నిత్య కైంకర్యాలు, నవనీత సేవ కోసం గుజరాత్ నుండి తెచ్చిన గిర్ గోవులు ఈరోజు తిరుమల బయలుదేరాయి. నల్గొండ జిల్లా చిట్యాల నుండి 4 వాహనాల్లో బయలుదేరిన ఈ గోవులు రేపు ఉదయం టీటీడీ పాలకమండలి ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారి చేతులమీదుగా తిరుపతి ఎస్ వి గో సంరక్షణ శాలకు అందజేయబడతాయి.
దర్శి ఎమ్మెల్యే శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ గోవులను సమర్పించగా, యుగ తులసి ఛైర్మన్ శ్రీ కె శివ కుమార్ గారు మొత్తం కార్యక్రమ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.