Trailer for ZEE5 Original Movie ‘Heads & Tales’ Garners Positive Response, Srividya, Chandini, ZEE5 OTT Movies, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: అక్టోబర్ 22న నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో ప్రీమియర్ కానున్న సినిమా
వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, ఒరిజినల్ మూవీస్, డిజిటల్ రిలీజ్లు… ఏవి కావాలన్నా వీక్షకులు ముందుగా చూసే ఓటీటీ వేదిక ‘జీ 5’. ఒక్క హిందీలో మాత్రమే కాదు…తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లో ‘జీ 5’ ఉంటే చాలు… వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ప్రజల కోసం ప్రత్యేకంగా సినిమాలు అందిస్తోంది. ఇటీవల జీ5లో విడుదలైన రాజ రాజ చోర సినిమా ఓటీటీ మాధ్యమంలో బిగ్గెస్ట్ హిట్ సాధించింది. తాజాగా ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. ప్రముఖ కథానాయిక రెజీనా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ‘అందరి కథలు ఒకే విధములు… కథనము మారే గతే బ్రతుకులు’ అంటూ సునీల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది.