TTD Chairman YV Subba Reddy, TTD EO KS Jawahar Reddy, Navaneetha Seva, Yuga Tulasi Foundation, TTD Ex Board Member K Shiva Kumar, TTD News, Bhakthi News, Telugu World Now,
TTD NEWS: టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారు, ఈవో డా కె ఎస్ జవహర్ రెడ్డి గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా చారిత్రాత్మక “శ్రీవారి నవనీత సేవ” ప్రారంభమైంది.
యుగ తులసి ఛైర్మన్ టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ కె శివ కుమార్ దంపతులతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీవారి నవనీత సేవ ప్రారంభం సందర్భంగా సాయంత్రం నవనీత కేంద్రం నుండి శ్రీవారి ఆలయం వరకూ సాగిన భక్తజన నవనీత సేవ ఊరేగింపులో అగ్రభాగాన నడుస్తూ శుభసూచకంగా ఘీంకరిస్తున్న గజరాజులు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా గజరాజులు ఇలా తోకలు పైకెత్తి ఆనందంగా ఘీంకరించడం పట్ల శ్రీవారి భక్తులు తమ హర్షాతిరేకాలను వ్యక్తపరుస్తున్నారు.