Warangal East Mla Nanapuneni Narender Powerful Comments on Etela Rajender, Huzurabad By Elections, Huzurabad News, CM KCR, Telugu World Now,
Telangana News: రెండేండ్ల క్రిందే ఈటెల రాజేందర్ బీజేపీతో కుమ్మక్కయ్యారు..పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసారు: నన్నపునేని నరేందర్ MLA
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ శిఖరం.. హుజూరాబాద్ ఆత్మగౌరవాన్ని ఈటెలడిల్లీలో తాకట్టు పెట్టాడు.. రెండేళ్ళ క్రిందనే బీజేపీతో కుమ్మకైన ఈటెల..నీడనిచ్చిన చెట్టునే నరికే ప్రయత్నం..తండ్రి లాంటి కేసీఆర్ గారిపై పిచ్చికూతలు.. ఎమ్మెల్యే,జమ్మికుంట ఇంచార్జ్ నన్నపునేని నరేందర్..
జమ్మికుంట పట్టణంలోని లయోలా స్కూల్ వద్ద మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు మరియు కౌన్సిలర్లు,ముఖ్యనాయకులతో కలిసి ఎమ్మెల్యే,జమ్మికుంట పట్టణ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు, రెండేండ్ల క్రిందే ఈటెల రాజేందర్ బీజేపీతో కుమ్మక్కయ్యారు..పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసారు..అవకాశం వచ్చిన ప్రతీసారి ప్రభుత్వం,పార్టీ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై విషం కక్కారు..పదవి కాంక్షతో ప్రజలను మరచి కుట్రలు చేసారు ఈటెల రాజేందర్.. బహుజనుల పక్షాన ఈటెలకు రెండు సార్లు మంత్రిగా, టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ గా, 6 సార్లు ఎమ్మెల్యే గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవకాశం కల్పించారు.. కానీ తప్పు చేసి దొరికిపోయి తల్లి లాంటి పార్టీకి అన్యాయం చేయజూసావు.. తండ్రిలాంటి కేసీఆర్ గారిని నానా మాటలు అంటున్నావు..
అస్తులపై మక్కువ, అధికారం పై మక్కువతో ప్రత్యర్థులతో చేతులు కలిపావు..అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెట్టజూసావు.. ఈటెల ఎందుకు రాజీనామా చేసారు.. అవినీతి ఆరోపణలు వస్తే విచారణ చేయడం జరుగుతుంది. ఈ సందర్బంగా గవర్నర్ భర్తరప్ చేసారు.. ఆరోపణలు రుజువయ్యేవరకు ఆగకుండా ఇదే అదనుగా బావించి తన అక్కసునంతా వెలగక్కుతూ ఆయన రాజీనామా చేసారు.. రాజీనామా చేయగానే ఆత్మగౌరవం అంటూ మాట్లాడిన ఈటెల ప్రజల్లో బలం లేక గడియాలు గ్రైండర్లు,కుక్కర్లు పంచుతున్నారు..తన ప్లెక్సీల్లో, ప్రచార మాద్యమాల్లో మోడీ ఫోటో, పార్టీ అద్యక్షుని ఫోటో కూడా పెట్టుకునేందుకు భయపడుతున్నారు.. బీజేపీ కూడా ఈటెలను నమ్మే పరిస్థితి లేదు.కేసీఆర్ నే నమ్మక ద్రోహం చేయజూసిన ఈటెల బీజేపీ ని చేయడా..? బీజేపీ నేతలు కూడా అందుకే ఈటెలతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు..
కేసీఆర్ గారు ఒక శిఖరం.అలాంటి నేతకు ద్రోహం చేయాలని చూసావ్.. నీకు రాష్ట్రవ్యాప్త గుర్తింపునిస్తే పార్టీనే అవమానించావ్.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించాడు ఈటెల..ప్రభుత్వం సజావుగా ప్రజలకి పాలన అందిస్తున్న సమయంలో ప్రభుత్వాన్ని, పార్టీని విచ్చిన్నం చేసే కుట్రకి తెరలేపాడు.. నేడు దళితబందును ఈటెల వ్యతిరేకిస్తున్నాడు. ట్రాష్ అంటున్నాడు.తన వల్లే పథకాలు వస్తున్నాయి అంటున్నాడు ఈటెల.. దళితబందు మార్చి బడ్జెట్ లోనే ప్రవేశపెట్టారు. అప్పుడు మంత్రిగా ఉన్న ఈటెల అసెంబ్లీలో మద్దతు తెలుపుతూ బల్లలు చరిచారు.. ఇప్పుడు భయటకొచ్చి గుండెలు బాదుకుంటూ సోయి లేకుండా మాట్లాడుతున్నాడు.. ఆసరా పెన్షన్ నువ్ చెప్తే వచ్చిందా.. కళ్యాణలక్ష్మి నువ్ చెప్తే వచ్చిందా.. రైతుబందు నువ్ చెప్తే వచ్చిందా..? ఈటెల సమాదానం చెప్పాలి. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.. ప్రజల మనసు తెలిసిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రదమంగా నీరు, కరెంట్, వ్యవసాయం, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసారు.. ఒక్కొక్కటిగా పనులన్నీ పూర్తి చేస్తున్నారు. తెలంగాణ అభివృద్దిలో దేశానికి ఆదర్శంగా నిలిపారు.. దళితులు తనవైపే ఉన్నారని ఈటెల ఫేక్ కథలు అల్లుతున్నాడు. దళితులంతా దళితబందు కేసీఆర్ వైపు ఉన్నారు.2018 లో 17 మంది దళిత కుటుంబాలను రోడ్డున పడేసిన వ్యక్తి ఈటెల. నాడే అతనిపై పోస్టర్లు వేసారు.. దళితులకు అన్యాయం చేయటం, దళితుల భూములు లాక్కోవటం చేసిన వ్యక్తి దళితులు తనకి మద్దతు నిలుస్తున్నాన్నారనటం సిగ్గుచేటు.. దరలు పెంచి దేశ ప్రజల నెత్తిన గుదిబండను పెట్టింది బీజేపీ.. తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన సాగుతుంటే, దేశంలో బీజేపీ ప్రజలపై మోయలేని బారాన్ని నింపుతుంది.. గ్యాస్ దరలు పెంచి మద్యతరగతి వాళ్ళ నడ్డి విరుస్తుంది.చిన్న వ్యాపారులను నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో మన్ను పోస్తుంది.. గ్యాస్ దర రెండు నెలల్లో 50రూపాయలు పెంచారు..కమర్శియల్ సిలిండర్ దర 84 రూపాయలు పెంచారు.. బీజేపీ ప్రభుత్వం పేదల పాలిట శాపంగా మారింది..అలాంటి పార్టీలో చేరి ఇక్కడ ఈటెల నీతులు వల్లిస్తున్నారు.. సంక్షేమాభివృద్ది కార్యక్రమాలతో ఇక్కడ ప్రజలకు టీఆర్ఎస్ ఫలాలనందిస్తుంది.. తెలంగాణాకు నిదులు, కేటాయింపుల విషయంలో బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుంది. అలాంటి పార్టీలో చేరి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్ ఈటెల.. పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని బీజేపీ మోసం చేసింది.. బీజేపీ చేసిందొకటే దరలు పెంచడం.. ప్రజలను దరిద్రంలోని నెట్టడం.. టీఆర్ఎస్ వెలుగువైపు నడిపిస్తుంటే బీజేపీ ప్రజలను చీకట్లలోకి తీసుకెలుతుంది..
బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ దమ్ముంటే ప్రజల పట్ల ప్రేమ ఉంటే భద్రాద్రి రాముని దగ్గరకు రవాణ మార్గమైన రైల్వేలైన్ వేయించి మాట్లాడాలి.. ఇల్లంతకుంట రామాలయానికి కేంద్రం నుండి నిదులు తీసుకొచ్చి చూపించాలి. స్వప్రయోజాలు మాత్రమే ఈటెలకు ముఖ్యం హుజూరాబాద్ ప్రజల అవసరాలు తనకి ముఖ్యం కాదు.. హుజూరాబాద్ లో బీసీ బిడ్డనని చెప్పుకుంటాడు, హైదరాబాద్ లో రెడ్డి అంటాడు.. బహుజన నేతనని చెప్పుకుంటూ ప్రజలకు ఈటెల అన్యాయం చేస్తున్నారు.. ఈటెల లెప్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు పెద్ద కరెప్షనిస్ట్..4 వేల డబుల్ బెడ్రూంలు ఇస్తే కట్టకుండా ప్రజలకు ఈటెల అన్యాయం చేసారు.. ఇల్లంతకుంటలో ఒక్క ప్రీజర్ బాక్స్ ఇవ్వటానికి 20 సార్లు దండాలు పెట్టిచ్చుకున్నాడు.. హుజూరాబాద్ ప్రజలు సరైన బుద్ది చెబుతారు.. జమ్మికుంట గాందీ చౌక్ నుండే నీ రాజకీయ సమాది జరుగుతుంది..
డిల్లీ గులాములకు బానిసలుగా ఉందామా.. హుజూరాబాద్ గల్లీలో సేవచేసే గులాబీలకు మద్దతుగా నిలుస్తూ ఆత్మగౌరవంతో ఉందామా ప్రజలు ఆలోచించాలి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు తెలిపి ఘన విజయాన్ని అందిద్దాం..