* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
మేషరాశి : వ్యాపారల్లో అనుకూలత లభించటం వళ్ళ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లాభాలు మీ వశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రయివేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మీరు కన్న కలలు నిజమయ్యే సమయం ఆసన్నం అయింది అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు తిరి మీకు ప్రశాంతత చేకూరుతుంది. చిరు వ్యాపారస్తులకు నూతన టెండర్లు. ప్రాజెక్ట్స్.. రావటం వళ్ళ ఒకింత సంతోషంగా ఉండగాగుతారు.
వృషభ రాశి : రాజకీయ వర్గాల వారికి శత్రు భాదలు పెరుగుతాయి అందుకే మాట ఇచ్చే ముందు అలోచించి మాట ఇవ్వటం మంచిది అన్న విషయం గమనించగలరు. సమాజంలో మీకు ఉన్న గౌరవ మర్యాదలను పొగట్టడానికి మీ వెనక వారే మంతనాలు జరుపుతున్నారన్న వార్త మిమ్మల్ని కాస్త కలవర పెడుతుంది. స్టాక్ మార్కెట్. బ్యాంకు. మరియు బంగారం లాంటి వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకి ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు.
మిథునరాశి : వైద్య రంగం వారికి అనుకోని మార్పులు రావటం వళ్ళ స్థాన మార్పిడి జరుగుతుంది. మీ సభ్యులతో మీ ఆలోచన సంప్రదింపులు మీకు వ్యతిరేక వైఖరిని చూపిస్తాయి. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువ అవ్వటం వళ్ళ ఉన్నత అధికారులతో మాట పట్టింపులు జరుపుతారు. ఆరోగ్యం విషయం లో కాస్త శ్రద్ద వహించటo మంచిది.
కర్కాటక రాశి : ఆర్థిక విషయాలలో కాస్త అసంతృప్తి ఉండటం వళ్ళ మానసిక భయానికి గురి కావటo జరుగుతుంది. పనులలో మరింత శ్రమ అధికమవుతుంది. మీరు ఊహించని వారి నుండి ఊహించని విధంగా కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసు కుంటారు. ఎప్పటికి కావు అనుకున్న భూ సంబంధిత వివాదాలు తొలగి ఒక కొలిక్కి వస్తాయి.
సింహ రాశి : ఒక పద్దతి ప్రకారం పనులలో ముందుకు సాగుతే మీరు అనుకున్నది సాదించ గలుగుతారు. కర్మాగారాల వారికీ. ఐరన్. స్టీలు వ్యాపారస్తులకి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. వివాహo గురించిన విషయాల్లో మంచి వార్తలను తెలుసుకుంటారు. వృత్తి పరమైన పనుల వారికి నిరాశను మిగులుస్తాయి. సాంకేతిక రంగాళవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
కన్య రాశి : నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసి కుటుంబం యొక్క అదర అభిమానాన్ని సంపాదిస్తారు. అధికారులతో స్వల్ప విభేదాలు ఏర్పడినప్పటికి అన్నీ ఒకింత కుదుటపడి వారికీ మీపై ఉన్న గౌరవ భావన మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో మీ బుద్ది బలంతో అందరి యొక్క ప్రశంసలను పొంద గలుగుతారు. కొన్ని పనుల్లో కదలిక వస్తుంది. ఆ కారణంగా ఊహించని పరిణామల్ని ఎదురుకుoటారు. ప్లాస్టిక్, రబ్బరు, కాగితాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు.
తులా రాశి : తులా రాశి వారు స్పీక్యూలేషన్ కి. జూదానికి. పందానికి. దూరంగా ఉండటం అనేది చెప్పదగి నటువంటి సూచన. మీరు సెంటిమెంట్ దెబ్బ తినే విదంగా కొన్ని సంఘటనలు జరిగుతాయి. సాధ్యం అయినంత వరకు మీ యొక్క వ్యూహాలను ఎవరికీ చెప్పక పోవటం మంచిది. ప్రభుత్వ పరమైన ఇంటర్వ్యూలు మీకు అనుకూలంగా మారి లాభాలని చేకూరుస్తాయి.
వృశిక రాశి : రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళలను ప్రదర్శించటానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. డిఫెన్స్. ఆర్మీ. సైటిస్టుల రంగాల వారికీ భాద్యతలు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలని సాదించ గలుగుతారు. ప్రేమ వ్యవహారాలు విషయంలో మీ అంచనాలు తారుమారు అవుతాయి. కొత్త వారిని గుడ్డిగా నమ్మటo మంచిది కాదు వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచంచటo అన్ని విధాలా శ్రేయస్కరం.
ధనుస్సు రాశి : రాజకీయ రంగాళవారికి ఇంకాస్త సమయం అవసరం అవుతుంది అందుకని మీరు అనుకున్న పనులు అయ్యేదాకా మీ ప్రణాళికలకు సంబందించిన విషయాలు గొప్యంగా ఉంచటం మంచిది. కర్మాగారాలలో పనిచేసే వారికీ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలక్రీకల్ కాంట్రాక్టులు చెజారి పోయే అవకాశం ఉంది కాబట్టి. జాగ్రత్తగా గమనించి ముందడుగు వేయగలరు. భార్యా భర్తల మధ్య అన్యోనత లోపించటం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు. సాఫ్ట్ వేరు రంగాళవారికి మంచి కాలం ఆసన్నం ఐయ్యింది అని చెప్పవచ్చు
మకర రాశి : తీర్థ యాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక భావనలతో గడుపుతారు. తమ సంతానం యొక్క భవిష్యత్ ను గురించి కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ప్రేమ వ్యవహారం అంతగా అనుకూలించని కాలం అని గమంచగలరు. అటవీ శాఖలో కదలికలు రావటం వల్ల పదవి చలానాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకోని విధంగా అనుకూలంగా మారటం జరుగుతుంది.
కుంభ రాశి : దీర్ఘ కాళిక సమస్యలను యుక్తితో పూర్తి చేసుకుంటారు. అది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పంచాయితీ రాజ్ వారికీ కొత్త కాంట్రాక్టులు రావటం వల్ల సంతోషంగా ఉంటారు. భూవివాదాలు సమసిపోయి అనుకూల పరిస్థితులు మిమ్మల్ని వరిస్తాయి అని భావించండి. అధ్యాపకులకు రోజువారీ చర్యలలో ఊహించని మార్పులకు గురి అవటం జరుగుతుంది.
మీన రాశి : జల వనరుల శాఖ వారికీ మరియు మత్య పరిశ్రమ వారికీ. వాటర్ బిజినెస్ వారికీ మీశ్రమ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగాళవారికి కొత్త పనులు అందటం వల్ల ఆనందంగా ఉంటారు. పాల వ్యాపారాలు. చేసేవారికి మంచి లాభాలు చేకూరె సమయం. కోర్టు వ్యవహారాలు అనుకోని విధంగా అనుకూలంగా మారటం జరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. అందరిని గుడ్డిగా నమ్మి వెళ్ళటం మంచిది కాదని తెలుసుకోండి. * బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 7013294002