* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
మేషరాశి : మీతో ఉంటూనే మిమ్మల్నే మోసం చేసే వారు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయం గమనించగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కానందున చికాకుతో మిత్రులతో స్వల్ప వాదనకి దిగటం మంచిది కాదు అని సూచన. వ్యాపార భాగస్తుల మధ్య మాట పొంతన లేక పోవటం వల్ల మనస్పర్థలుకు దారి తీయవచ్చు. మానసిక ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వల్ల మీ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది అని చెప్పవచ్చు.
వృషభ రాశి : వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఏమరుపాటు పనికి రాదు అని తెలియ పరుస్తున్నాను. మిత్రులతో కలిసి నూతన కార్యాలను తలపెట్టి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. విందు వినో దాల్లో పాల్గొని కొత్త పరిచయాలు మరియు సంఘములో మీకంటు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు.
మిథునరాశి : వాహన. గృహ. విక్రయాలకు సంబందించిన ప్రయత్నాలు కాస్త మండకోడీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు. కానీ చివరికి మీ నిర్ణయానికే కట్టుబడతారు. రక్షణ శాఖ వారికి స్థాన చలనం ఉంటుంది అని చెప్పవచ్చు
కర్కాటక రాశి : అన్ని వైపులనుండి ఆదాయం లభిస్తున్నందున కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. అగ్నిమాపాక దళం వారికీ కొత్త పదవులు లభించునున్నాయి. నూతన వ్యాపారస్తులకు మరియు పెట్టుబడి దారులకు అనుకూల సమయం అని చెప్పవచ్చు.
సింహ రాశి : కొన్ని వ్యవహారాల్లో మీరు చంచల బుద్ది తో వ్యవహరించటం వల్ల మీకు తెలియకుండానే కొన్ని అనుకోని ఇబ్బందులను కొన్ని తెచ్చుకున్నవారు అవుతారు. ఒక శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచి మీరు విందు వినోదాల్లో పాల్గొనేలా చేస్తుంది. అటవీ శాఖ సంస్థల్లో అనుకోని మార్పులు సంభవించటం వల్ల స్థాన చలానాలు ఏర్పడుతాయి .
కన్య రాశి : సంతానం విషయం లో కాస్త మనస్థాపనికి గురైనావుతారు. సాంకేతిక విద్యార్థులకు అనుకూల సమయం కష్టపడి చదుకుంటే విజయాన్ని సాధించ గలుగుతారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. వ్యాయమ శాలల వారికి మరియు పాక శాలల వారికీ వారి వ్యాపారాల్లో లాభాలని పొందగలరు..
తులా రాశి : రైతులకి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అని చెప్పవచ్చు, మీ చేతుల్లో ఉన్న అధికారాన్ని మిమ్మల్ని నమ్ముకున్న వారికి ధార పోస్తారు మీ ద్వారాలాభ పడిన వారే మిమ్మల్ని విమర్శించటం వల్ల మనస్థాపానికి గురి అవ్వటం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి మీరు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. మంచి అవకాశాలను సాధిస్తారు అని చెప్పవచ్చు
వృశిక రాశి : భార్య తరుపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. మీరు చేపట్టిన భాద్యతలు సమర్ధ వంతంగా పూర్తి చేసి అందరి యొక్క మన్నలను పొందుతారు. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లి సంతోషంగా గడుపుతారు
ధనుస్సు రాశి : వైద్య రంగం వారికి నూతన కార్యాల వల్ల సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు అని చెప్పవచ్చు. పట్టు పరిశ్రమలు. కుట్టు పరిశ్రమలు. కార్మికులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అధ్యాపకులకు పాఠ్య అంశాల్లో ఊహించని మార్పులకు గురి అవటం జరుగుతుంది
మకర రాశి : సాంకేతికరంగాల్లో వారికి కొత్త పనులు అందటం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. పాల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరె సమయం అని చెప్పవచ్చు. పశు వ్యాపారస్తులకు. పక్షులు పెంపుడు జంతువుల వ్యాపారస్తులకి మాధ్యమిక ఫలితాలు వరిస్తాయి. ఆర్థిక వ్యాపారాలు మండకోడీగా సాగుతాయి. కుటుంబఆరోగ్యం పై శ్రద్ద వహించాలి
కుంభ రాశి : కొత్తపరిచయాల వల్ల సమస్యలను ఎదురుకుంటారు. అందరిని గుడ్డిగా నమ్మి వెళ్ళటం మంచిది కాదని తెలుస్కోండి. ఆధ్యాత్మిక చింతన చేయండి. దానివల్ల మానసిక బలం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దానికి ఇప్పుడు బాధ పడ్డ తరువాత మన మంచికే అయింది అని ఆనందిస్తారు
మీన రాశి : చేసే పనిలో అవరోధలు ఏర్పడుతాయి కాబట్టి ఏమి చేయాలన్న బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ సినీ వర్గాల వారికీ శుభం కలుగుతుంది కానీ మీ వెనక మిమ్మల్ని మోసం చేసే వ్యవహారాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించ గలరు. మీ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది * బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 7013294002