* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
మేషరాశి : స్నేహితులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు. భూ వివాదాలు నుండి బయటపడతారు. కావాల్సిన వారి నుండి ముఖ్య సమాచారం మీకు అందుతుంది, ఉద్యోగులకు అధికారులకు సఖ్యత పెరుగుతుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాల నుంది బయట పడి రావాల్సిన కాంట్రాక్టులు దక్కించుకోగల్గుతారు. వీరు పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల సర్వత్రా విజయాన్ని సిద్ధింప చేస్తుంది.
వృషభ రాశి : ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య సంప్రదింపులు జరుపుతారు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోగలుగుతారు. న్యాయ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. సినీ రంగాల వారికీ కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడిన వారి శ్రమకి తగిన ఫలితం దక్కించుకోగలుగుతారు.
మిథునరాశి : ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్త పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. రాజకీయ రంగం వారికి కొత్త ప్రాజెక్ట్స్ వశం అవుతాయి .కర్షకులకు రుణదాతల సమస్య తొలగి కాస్త స్వస్థత లభిస్తుంది. మీ కష్టానికి తగిన గౌరవం లభించక పోవటంతో కాస్త మానసిక ఆందోళన పడటం జరుగుతుంది. మీరు తెలుపు రంగులు దుస్తులు ధరించటం మంచిది..
కర్కాటక రాశి : మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మీవిలువ పెరుగుతుంది. ఆరోగ్యం పై దృష్టి ఉంచటం మంచిది. వ్యాపారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలాన్ని గడపటం జరుగుతుంది. మీరు నవగ్రహలకి 11 ప్రదక్షిణలు చేసి స్తోత్రం పారాయణం చేయటంవల్ల సర్వ సిద్దులు లభిస్తాయి.
సింహ రాశి : వృత్తి వ్యాపారల్లో స్వల్ప మార్పులని గమనిస్తారు. ఉద్యోగులు మీ అంచాలను అందుకుంటారు. ఋణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మిత్రులతో అనుకోని వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నందున వారితో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. విరోదులను తక్కువగా అంచనా వేయటం మంచిది కాదని గమనించగలరు. ఈ రాశి వారు భగవత్ గీత పారాయణం చేయటం వల్ల అన్నింట విజయం సాదించగలుగుతారు.
కన్య రాశి : బందువులలో మాట పట్టింపులు ఉంటాయి. మీరు ఒక్కోసారి మనకి సంబంధం లేకపోయినా పనులకి కూడా మనమే సమాధానం చెప్పాలిసిన పరిస్థితులు ఏర్పడతాయి. సామజిక కార్యాలవల్ల గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార దారులు పై వారి నుండి ప్రశంసలు పొందుతారు 11.మానసికంగా దృడంగా ఉండటం వల్ల అవసరానికి తగిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం వల్ల మంచి ఫలాలను పొందవచ్చు..
తులా రాశి : వ్యాపారాలు కాస్త మందకోడీగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. మీకున్న కోర్టు సమస్యలు తీరుతాయి. స్థిరాస్తీకి సంబందించిన విషయాలు, స్టాంపింగ్ కి సంబంచిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వీసా మరియు విదేశీ యానం చేసేవారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీరు నలుపు రంగులు దుస్తులు ధరించటం వల్ల దృష్టి దోషాలు తొలగి శుభం కలుగు తుంది .
వృశిక రాశి : రాజకీయ పలుకుబడి పెరగటం వల్ల పక్కవారికి సహాయం చేయగలుగుతారు. నాణ్యత లేని వస్తువులను కొనటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందిని ఇవ్వదగినటువంటి సూచన. గతంలో అనుకోకుండా జరిగిన తప్పులవల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన లైసెన్స్ లు మరియు లీస్ లను అనుకున్నవి దక్కించుకోగలుగుతారు. ఈ రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించటం ఉత్తమం.
ధనుస్సు రాశి : ఋణ బాధలు ఉన్నపటికీ కూడా మిత్రుల సహాయ సహకారాల వల్ల ఆ పరిస్థితులని చక్కదిద్దుకోగల్గుతారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలిగినప్పటికి కుటుంబం యొక్క సలహాలను పాటించటం వల్ల సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త నైపుణ్యాలని నేర్చుకుని అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్ కి సంబందించిన కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లక్ష్యంపై ఏకాగ్రత పెంచుకోవాలి కొన్ని విషయాలల్లో నిపుణుల సలహాల అవసరం పడవచ్చు. ఆంజనేయునికి సింధూరంతో పూజచేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మకర రాశి : ఈ రాశి వారికి చేసే పనిలో అవరోధాలు ఏర్పడుతాయి కాబట్టి ఏమి చేయాలన్న బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ, సినీ వర్గాల వారికి శుభం కలుగుతుంది కానీ మీ వెనక మిమ్మల్ని మోసం చేసే వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. మీ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం వల్ల కుటుంబంలో ఆనందాన్ని పెంచిన వారు అవుతారు. చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు సానుకూలంగా మారగలిగే కాలం ఆసన్నమైనది అని గమనించ గలరు.
కుంభ రాశి : కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. స్నేహితులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు. భూ వివాదాలు నుండి బయటపడతారు. కావాల్సిన వారి నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగులకు అధికారులకు సఖ్యత పెరుగుతుంది. వీరు వెంకటేశ్వరునికి తులసిదళాలతో సహస్ర నామ అర్చన చేయటం వల్ల మరియు రావి, వేప, మామిడి లాంటి 11దేవతా వృక్షంలను నాటడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది.
మీన రాశి : కొత్త పరిచయాల వల్ల సమస్యలను ఎదురు కుంటారు. అందరిని గుడ్డిగా నమ్మి వెళ్ళటం మంచిది కాదని తెలుస్కోండి. ఆధ్యాత్మిక చింతన చేయండి. దానివల్ల మానసిక బలం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దానికి ఇప్పుడు బాధ పడ్డ తరువాత మన మంచికే అయింది అని ఆనందిస్తారు. వీరు సూర్య ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 7013294002