★ బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు ★ వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు ★ యజుర్వేద పండితులు ★ గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి ★ మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి. Ph+91 7013294002
మేష రాశి : సమాజంలో మీకంటూ ఉన్న దీర్ఘ కాళిక సమస్యలను యుక్తితో పూర్తి చేసుకుంటారు. అది అందరిని ఆశ్చర్యానికి గురించేస్తుంది. పంచాయితీ రాజ్ వారికీ కొత్త కాంట్రాక్టులు రావటం వల్ల సంతోషంగా గడపటం జరుగుతుంది. భువివాదాలు సమసిపోయి అనుకూల పరిస్థితులు మిమ్మల్ని వరిస్తాయి అని భావించండి. అధ్యాపకులకు పాఠ్య విషయాలలో ఊహించని మార్పులకు గురి అవటం జరుగుతుంది. పట్టు పరిశ్రమలు, కుట్టు పరిశ్రమలు, కార్మికులకు మీశ్రమ ఫలితాలు కలుగుతాయి. వైద్య రంగం వారికీ నూతన కార్యాలవాళ్ళ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఆంజనేయునికి సింధూరం తో పూజచేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది, గోసేవ చేసుకోవటం, పేద పిల్లలకు పాలను మరియు పాల కోవలను పంచటం వల్ల మీ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు.
వృషభ రాశి : రాజకీయ సినీ వర్గాల వారికీ శుభం కలుగుతుంది కానీ మీ వెనక మిమ్మల్ని మోసం చేసే వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించ గలరు. జల వనరుల శాఖ వారికీ మరియు మత్స్య పరిశ్రమ వారికీ, వాటర్ బిజినెస్ వారికీ మీశ్రమ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగాల వారికి కొత్త పనులు అందటం వల్ల ఆనందం గా ఉండగలుగుతారు. పాల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరె సమయం అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకోని విధంగా అనుకూలంగా మారటం జరుగుతుంది. వీరు ఇంద్రాక్షి స్తోత్రం పారాయణ చేయటం వల్ల మరియు పక్షులకు ఆహారం తినిపించటం వల్ల అన్ని సిద్దిస్తాయి. అటవీ శాఖలో కదలికలు రావటం వల్ల పదవి చలానాలు ఉంటాయి అని చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారు శివుడికి రుద్ర అభిషేకం చేపించటం వల్ల అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
మిథున రాశి : సంఘములో పరిచయాలు ఏర్పడుతాయి. అందరిని ఆకట్టుకుంటారు. కొత్త అవకాశాలు మీ వశం అవుతాయి. కొంత మంది వల్ల మీరు మానసిక బాధ అనుభవించాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిడులు ఎదురైవుతాయి. రాజకీయ నాయకుల పరిచయాల వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. ఈ రాశి వారు భాగవతం పారాయణం చేయటం వల్ల మరియు విధి బాలురకు మరియు పేదలకు దుపట్లు బట్టలు పంచటం వల్ల కూడా ఉన్నత ఫలితాలను పొందవచ్చు. మీరు నలుపు రంగులు దుస్తులు ధరించటం వల్ల ద్రుష్టి దోషాలు తొలగి శుభం కలుగు తుంది.
కర్కాటక రాశి : అనుకోని ఇబ్బందులు రావటం వల్ల తగువులు పడతారు అందుకని జాగ్రత్తగా ఉండటం మంచిది. దూరప్రయాణాలు చేస్తారు. సెల్ఫ్ డ్రవింగ్ చేసే వారు కాస్త గమనించి వాహనాలను నపుడగలరు. రాజకీయ పలుకుబడి పెరగటం వల్ల పక్కవారికి సహాయం చేయగలుగుతారు. నాణ్యత లేని వస్తువులను కొనటం వల్ల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందిని ఇవ్వవలసినటువంటి సూచన. గతంలో అనుకోకుండా జరిగిన తప్పుల వల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన లైసెన్స్ లు మరియు లీస్ లను అనుకున్నవి దక్కించు కోగలుగుతారు. ఈ రాశివారు సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయులుకి వడ మాల సమర్పిస్తే లేదా అనాధ శవాలకి దహన సంస్కారం చేసిన లేదా ఛేపించిన అన్ని రకాల శుభాలు జరుగుతాయి. ఈ రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించటం ఉత్తమమ్
సింహ రాశి : వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలగటం వల్ల కొత్త ఉత్సహం మీలో కనబడుతుంది. అనుకోని విషయాల వల్ల కాస్త నిరాశకి గురి అవుతారు. రాజకీయ రంగాల వారికీ శత్రు సమస్యలు అధికం అవుతాయి అందుకని ఎం చేసినా బాగా అలోచించి ఒక నిర్ణయానికి రావాలి. వృత్తి వ్యాపారల్లో స్వల్ప మార్పులని గమనిస్తారు. మిత్రులతో అనుకోని వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నందున వారితో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. విరోదులను తక్కువగా అంచనా వేయటం మంచిది కాదని గమనించగలరు. ఈ రాశివారు భగవత్ గీత పారాయణం చేయటం వల్ల పెళ్లి ఈడికి ఎదిగిన ఒక పేద అమ్మాయికి పెళ్లి సమాల్నా నిమిత్తం ఖర్చు భరించినట్లయితే అన్నింట విజయం సాదించ గలుగుతారు. ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించటం మంచిది.
కన్య రాశి : ముఖ్యమైన విషయాల్లో మీ బుద్ది బలంతో అందరి యొక్క ప్రశంశలను పొంద గలుగుతారు. కొన్ని పనుల్లో కదలిక వస్తుంది, ఆ కారణంగా ఊహించని పరిణామల్ని ఎదురుకుంటారు. ప్లాస్టిక్, రబ్బరు, కాగితాలా వ్యాపారస్తులకు మీశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. సంతానం విషయంలో కాస్త మనస్థాపానికి గురవుతారు. సాంకేతిక విద్యార్థులకు అనుకూల సమయం, కష్టపడి చదుకుంటే విజయాన్ని సాధించ గలుగుతారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం వల్ల మంచి ఫలాలను పొందవచ్చు.
తులా రాశి : స్థిరాస్తీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అవాలంబిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించునుంది. సంతానం విషయంలో ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్త పనులు సకాలం లో పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారు ఆంజనేయునికి సింధూరం తో పూజచేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
వృశ్చిక రాశి : ఎప్పటికి కావు అనుకున్న భూ సంబంధిత వివాదాలు తొలగి ఒక కొలిక్కి వస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంనందున కుటుంబ సభ్యులతో విందు వినోదల్లో పాలు పంచుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్త పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలాన్ని గడపటం జరుగుతుంది. ఈ రాశి వారు నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసి నవగ్రహా స్తోత్రం పారాయణం చేయటం వికలాంగులకు పుస్తకాలను దానం చేయటం వల్ల సర్వ సిద్దులు లభిస్తాయి. మీరు ఎరుపు రంగులు దుస్తులు ధరించటం మంచిది.
ధనుస్సు రాశి : కొత్త పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాల నుండి బయట పడతారు. వ్యాపారాల్లో అనుకూలత లభించటం వళ్ళ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లాభాలు మీ వశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రయివేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మీరు కన్న కలలు నిజమయ్యే సమయం ఆసన్నం అయింది అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు తీరి మీకు ప్రశాంతత చేకూరుతుంది. చిరు వ్యాపారస్తులకు నూతన టెండర్లు, ప్రాజెక్ట్స్ రావటం వళ్ళ ఒకింత సంతోషంగా ఉండ గలుగుతారు. మీతో ఉంటూనే మిమ్మల్నే మోసం చేసే వారు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయం గమనించగలరు. ఈ రాశి వారు నిమ్మకాయ దండలను అమ్మవారికి సమర్పించి 21 నిమ్మ దీపాలను రావి చెట్టు లేదా ఏదైనా దేవత వృక్షం కింద ముగ్గు వేసి నెయ్యితో వెలిగించి నట్లయితే మరియు గుడ్డి వారికీ కళ్ళ జోడులను దానము చేసినట్లయితే అన్ని కార్యాల్లో విజయాన్ని సాధించినవారు అవుతారు. వీరు ఈరోజు పసుపు పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల అన్ని సాధిస్తారు.
మకర రాశి : న్యాయ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. సినీ రంగాల వారికీ కాస్త అనుకూల పరిస్తుతులు ఏర్పడిన వారి శ్రమకి తగిన ఫలితం దక్కించుకో గలుగుతారు. నిర్ణయలు జాగ్రత్తగా తీస్కోండి. రాజకీయ వర్గాల వారికీ శత్రు భాధలు పెరుగు తాయి అందుకే మాట ఇచ్చే ముందు అలోచించి మాట ఇవ్వటం మంచిది అన్న విషయం గమనించగలరు. ఆర్థిక లావాదేవీల విషయాలు మీరు ఒకటికి పది సార్లు అలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు. నౌకాదళం వారికీ కొత్త పదవులు లభించే అవకాశం ఉన్నందుకు వారు మానసిక ఆనందనికి గురి అవుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఈ రాశి వారు శ్రీ మహా విష్ణువుకి పెరుగన్నం నివేదన చేసి విష్ణు సహస్ర నామాలతో తులసి దళ అర్చన చేసినట్లయితే మరియు ఆకలితో ఉన్న పేదలకు అన్నదానం చేసినట్లయితే మీకు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అయి సంఘములో గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి : భాగస్టుల మధ్య మాట పొంతన ఉండక పోవటంతో కాస్త కలవర పడతారు. అధికారులతో విభేదాలు ఏర్పడుతాయి. హార్స్ రేసింగులు, పేకాటలు, లాటరీలు, బెట్టింగులు లాంటి ఈజీ మని కోసం అలోచించి కాలాన్ని శ్రమని వృధా చేసుకుంటారు. నూతన ప్రయత్నాలు చేసి కుటుంబాన్ని ఆనందింప చేస్తారు. నూతన కార్యాలయాలు గురించి సన్నిహితులతో నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులకు తగినంత ఆదాయం లభిస్తుంది వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అప్పలని నివేదన చేస్తే లేదా బఠాణిలను దానం చేసినట్లయితే రక్షణ లభిస్తుంది. వీరు గోధుమ రంగు దుస్తులు ధరించటం మంచిది.
మీన రాశి : వృత్తి వ్యాపారంలో నిరాశను మిగులుస్తాయి. కావాల్సిన వారి నుండి ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూ వివాదాలు నుండి బయటపడతారు. స్నేహితులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు అధికారులకు సఖ్యత పెరుగుతుంది. వీరు వెంకటేశ్వరునికి తులసి దళాలతో సహస్ర నామ అర్చన చేయటం వల్ల మరియు రావి, వేప, మామిడి లాంటి 11 దేవతా వృక్షంలను నాటడం వల్ల. ఉత్తమ ఫలితం ఉంటుంది.. వీరు పసుపు రంగు దుస్తులు ధరించటం మంచిది.★ బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు ★ వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు ★ యజుర్వేద పండితులు ★ గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి ★ మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి. Ph
+91 7013294002