★ బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు ★ వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు ★ యజుర్వేద పండితులు ★ గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి ★ మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 7013294002
మేష రాశి : కొత్త నైపుణ్యాలని నేర్చుకుని అర్థం చేసుకోగలుగుతారు, భవిష్యత్ కి సంబందించిన కీలక నిర్ణయాలు తీస్కోగలుగుతారు, లక్ష్యం పై ఏకాగ్రత పెంచుకోవాలి కొన్ని విషయాలల్లో నిపుణుల సలహాల అవసరం పడవచ్చు. కొన్ని వ్యవహారాలు చికాకు పరుస్తాయి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. స్నేహితులతో వాదనలకు దిగటం మంచిది కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి . ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను అందరూ గౌరవస్తారు. ఈ రాశి వారు ఆంజనేయునికి సింధూరం తో పూజ చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గోసేవ చేసుకోవటం, పేద పిల్లలకు పాలను మరియు పాల కోవలను పంచటం వల్ల మీ కోరికలను నెర వేర్చుకో గలుగుతారు.
వృషభ రాశి : సాంకేతిక రంగాల వారికి కొత్త పనులు అందటం వల్ల ఆనందం గా ఉండగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకోని విధంగా అనుకూలంగా మారటం జరుగుతుంది. అటవీ శకలో కదలికలు రావటం వల్ల పదవి చలానాలు ఉంటాయి అని చెప్పదగ్గ సూచన. తీర్థ యాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక భావనలతో గడుపుతారు. ఎప్పటికి కావు అనుకున్న భూ సంబంధిత వివాదాలు తొలగి ఒక కొలిక్కి వస్తాయి. అన్ని వైపులానుండి ఆదాయం లభిస్తుంనందున కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు, ఈ రాశి వారు శివుడికి రుద్ర అభిషేకం చేపించటం వల్ల అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
మిథున రాశి : ప్రభుత్వ పరమైన ఇంటర్వ్యూలు మీకు అనుకూలంగా మారి లాభాలని చేకూరుస్తాయి. రైతులకి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అని చెప్పవచ్చు. మీ చేతుల్లో ఉన్న అధికారాన్ని మిమ్మల్ని నమ్ముకున్న వారికీ ధార పోస్తారు. మీ ద్వారా లాభ పడిన వారే మిమ్మల్ని విమర్శించటం వల్ల మనస్థాపనికి గురి అవ్వటం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి మీరు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. మంచి అవకాశాలను సాధిస్తారు అని చెప్పవచ్చు. మానసిక మైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. మీరు భాగవతం పారాయణం చేయటంవల్ల మరియు వీధి బాలురకు మరియు పేదలకు దుప్పట్లు, బట్టలు పంచటం వల్ల కూడా ఉన్నత ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారు ఈరోజు నలుపు రంగులు దుస్తులు ధరించటం వల్ల ద్రుష్టి దోషాలు తొలగి శుభం కలుగు తుంది.
కర్కాటక రాశి : కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లి సంతోషంగా గడుపుతారు. ఒక అశ్చర్య కరమైన విషయం వినటం వల్ల మీరు ఆనందానికి గురి అవుతారు. వృత్తి ఉద్యోగాల్లో పై చేయి మీదే అవుతుంది. ఆప్తులతో విందు వినోదల్లో పాల్గొంటారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి, ఈ రాశి వారు సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయ స్వామికి వడ మాల సమర్పిస్తే లేదా అనాధ శవాలకి దహన సంస్కారం చేసిన లేదా చేపించినా అన్ని రకాల శుభలు జరుగుతాయి. ఈ రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించటం మంచిది.
సింహ రాశి : ఒక శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచి మీరు విందు వినోదల్లో పాల్గొనేలా చేస్తుంది. అటవీ శాఖ సంస్థల్లో అనుకోని మార్పులు సంభవించటం వల్ల స్థాన చలానాలు ఏర్పడుతాయి. విద్యా రంగాల్లో వారికీ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఏది చేసిన కాస్త ఆగి అలోచించి చేయటం ఉత్తమం అని తెలుకోండి. కొత్త నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు తీసుకుంటారు. బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఋణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. భగవత్ గీత పారాయణం చేయటం వల్ల, పెళ్లి ఈడికి ఎదిగిన ఒక పేద అమ్మాయికి పెళ్లి సమాల్నా నిమిత్తం ఖర్చు భరించినట్లయితే అన్నింట విజయం సాదించ గలుగుతారు. ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించటం మంచిది.
కన్య రాశి : ఉద్యోగస్తులకు పైన వారితో ఒత్తిడి పెరుగుతుంది కనుక కాస్త మానసిక శ్రమకి గురి అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నూతన గృహ యోగం లభిస్తుంది. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవటం మంచిది. బందువులలో మాట పట్టిపులు ఉంటాయి. మీరు ఒక్కోసారి మీకు సంబంధం లేకపోయినా కొన్ని పనులకి కూడా సమాధానం చెప్పాలిసిన పరిస్థితులు ఏర్పడతాయి. సామాజిక కార్యాల వల్ల గౌరవం పెరుగుతుంది. మహా భారతం పారాయణం చేయటం వల్ల మరియు వికలాంగులకు చేయూత కర్రలు లేదా జైపూర్ కాళ్ళను దానంగా ఇవ్వటం వల్ల కూడా సకల శుభాలను పొందవచ్చు. ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం వల్ల మంచి ఫలాలను పొందవచ్చు.
తులా రాశి : రాజకీయ సినీ వర్గాల వారికీ శుభం కలుగుతుంది కానీ మీ వెనక మిమ్మల్ని మోసం చేసే వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జల వనరుల శాఖ వారికీ మరియు మత్య పరిశ్రమ వారికీ. వాటర్ బిజినెస్ వారికీ మీశ్రమ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగాల వారికి కొత్త పనులు అందటం వల్ల ఆనందంగా ఉండ గలుగుతారు. పాల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరె సమయం అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకోని విధంగా అనుకూలంగా మారటం జరుగుతుంది. వీరు ఇంద్రాక్షి స్తోత్రం పారాయణ చేయటం వల్ల అన్ని సిద్దిస్తాయి.
వృశ్చిక రాశి : వ్యాపారల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. మీరు చేసే ఉద్యోగాల్లో స్థాన చలానాలు ఉన్నపటికీ మీ యొక్క హోదా పెరిగి ప్రత్యేక గుర్తింపుతో రాణించ గలుగుతారు. నూతన వ్యాపారస్తులకు మరియు పెట్టుబడి దారులకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. అగ్ని మాపక దళం వారికీ కొత్త పదవులు లభించునున్నాయి. మీరు చేస్తున్న పనులలో కాస్త ఆటంకాలు వచ్చినప్పటికిని నూతన పరిచయాల వల్ల పట్టుదలతో ఆ పనులను పూర్తి చేస్కో గలుగుతారు. మీరు నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసి స్తోత్రం పారాయణం చేయటం వల్ల సర్వ సిద్దులు లభిస్తాయి. మీరు ఈరోజు ఎరుపు రంగులు దుస్తులు ధరించటం మంచిది.
ధనుస్సు రాశి : వ్యాపారాల్లో కాస్త చికాకు పెరుగుతుంది. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. భూ వివాదాలు నుండి బయటపడతారు. కావలసిన వారి నుండి ముఖ్య సమాచారం మీకు అందుతుంది. ఉద్యోగులకు అధికారులకు సఖ్యత పెరుగుతుంది. ఈ రాశి వారు నిమ్మకాయ దండలను అమ్మవారికి సమర్పించి 21 నిమ్మ దీపాలను రావి చెట్టు లేదా ఏదైనా దేవతా వృక్షం కింద ముగ్గు వేసి నెయ్యితో వెలిగించినట్లయితే మరియు గుడ్డి వారికీ కళ్ళ జోడులను దాననము చేసినట్లయితే అన్ని కార్యాల్లో విజయాన్ని సాధించినవారు అవుతారు. ఈ రాశి వారు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల అన్ని సాధిస్తారు.
మకర రాశి : ప్లాస్టిక్ రబ్బరు కాగితాలా వ్యాపారస్తులకు మీశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. సంతానం విషయంలో కాస్త మనస్థాపానికి గురవుతారు. సాంకేతిక విద్యార్థులకు అనుకూల సమయం. కష్టపడి చదువుకుంటే విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. వృత్తి వ్యాపార దారులకు పై వారి నుండి ప్రశంసలు పొందుతారు. మానసికంగా దృడంగా ఉండటం వల్ల అవసరానికి తగిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేస్కో గలుగుతారు. ఈ రాశి వారు శ్రీ మహా విష్ణువుకి పెరుగున్నo నివేదన చేసి విష్ణు సహస్ర నామలతో తులసి దళ అర్చన చేసినట్లయితే గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి : అనుకోని ఇబ్బందులు రావటం వల్ల తగువులు పడతారు అందుకని జాగ్రత్తగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేస్తారు. సెల్ఫ్ డ్రవింగ్ చేసే వారు కాస్త గమనించి వాహనాలను నడప గలరు. రాజకీయ పలుకుబడి పెరగటం వల్ల పక్క వారికి సహాయం చేయగలుగుతారు. నాణ్యత లేని వస్తువులను కొనటం వల్ల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. గతంలో అనుకోకుండా జరిగిన తప్పుల వల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన లైసెన్స్ లు మరియు లీస్ లను అనుకున్నవి దక్కించు కో గలుగుతారు.
మీన రాశి : స్నేహితులతో ముఖ్య మైన విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు అధికారులకు సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో మాట పట్టింపింపులు వస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఆరోగ్యం పై ద్రుష్టి ఉంచటం మంచిది. వ్యాపారల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. మీరు చేసే ఉద్యోగాల్లో స్థాన చలానాలు ఉన్నపటికీ మీయొక్క హోదా పెరిగి ప్రత్యేక గుర్తింపుతో రాణించ గలుగుతారు..★ బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు ★ వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు ★ యజుర్వేద పండితులు ★ గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి ★ మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞
+91 7013294002