* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
మేష రాశి : కుటుంబ సమస్యలు అధికo అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి, అయితే శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో కాస్త చికాకు పెరుగుతుంది. ఈ మేష రాశి వారు నిమ్మకాయ దండలను అమ్మవారికి సమర్పించి, 21 నిమ్మ దీపాలను రావి చెట్టు లేదా ఏదైనా దేవతా వృక్షం కింద ముగ్గు వేసి నెయ్యితో వెలిగించినట్లయితే మరియు గుడ్డి వారికీ కళ్ళ జోడులను దానము చేసినట్లయితే అన్ని కార్యాల్లో విజయాన్ని సాధించినవారు అవుతారు.
వృషభ రాశి : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువుల వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు శ్రమ ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు శ్రీ మహా విష్ణువుకి పెరుగన్నo నివేదన చేసి విష్ణు సహస్ర నామాలతో తులసి దళ అర్చన చేసినట్లయితే మరియు ఆకలితో ఉన్న పేదలకు అన్నదానం చేసినట్లయితే మీకు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అయి సంగంలో గుర్తింపు లభిస్తుంది.
మిథున రాశి : సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అవలంబిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించనుంది. సంతానం విషయంలో ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మీరు ఈరోజు శివునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అభిషేకం చేపించటం వల్ల మరియు అనారోగ్యం తో ఉన్న పేదలకు మందులను ఇవ్వటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.
కర్కాటక రాశి : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. కొత్త పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అనుకున్న పనులు అవకపోవటంతో నిరాశకు గురి అవుతారు. దూర ప్రయత్నాలు చేస్తారు. మీరు నవగ్రహలకి 11 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రం పారాయణం చేయటం, వికలాంగులకు పుస్తకాలను దానం చేయటం వల్ల సర్వ సిద్దులు లభిస్తాయి. మీరు ఈరోజు ఎరుపు రంగులు దుస్తులు ధరించటం మంచిది.
సింహ రాశి : కొత్త నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు జరుగుతాయి. బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలగటం వల్ల కొత్త ఉత్సహం మీలో కనబడుతుంది. అనుకోని విషయాల వల్ల కాస్త నిరాశకి గురి అవుతారు. రాజకీయ రంగాల వారికీ శత్రు సమస్యలు అధికం అవుతాయి. అందుకని ఎం చేసినా బాగా అలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఈ రాశి వారు భగవత్ గీత పారాయణం చేయటం వల్ల పెళ్లి ఈడికి ఎదిగిన ఒక పేద అమ్మాయికి పెళ్లి సమాల్నా నిమిత్తం ఖర్చు భరించినట్లయితే అన్నింట విజయం సాదించగలుగుతారు. ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించటం మంచిది.
కన్య రాశి : మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరుకు మౌనంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక భావన పెంచుకోవటo వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది అది మీకు మంచి చేస్తుంది. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పైన వారితో ఒత్తిడి పెరుగుతుంది కనుక కాస్త మానసిక శ్రమకి గురి అవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. నూతన గృహ యోగం లభిస్తుంది. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవటం మంచిది. ఈ రాశి వారు మహా భారతం పారాయణం చేయటం వల్ల మరియు వికలాంగులకు చేయూత కర్రలు లేదా జైపూర్ కాళ్ళను దానంగా ఇవ్వటం వల్ల కూడా సకల శుభాలను పొందవచ్చు.
తులా రాశి : సంగంలో పరిచయాలు ఏర్పడుతాయి. అందరిని ఆకట్టుకుంటారు. కొత్త అవకాశాలు మీ వశం అవుతాయి. కొంత మంది వల్ల మీరు మానసిక బాధ అనుభవించాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిడులు ఎదురైవుతాయి. పరిచయాల వల్ల సమాజం లో గౌరవం ఏర్పడుతుంది. మీరు భాగవతం పారాయణం చేయటం వల్ల మరియు పేదలకు దుప్పట్లు బట్టలు పంచటం వల్ల కూడా ఉన్నత ఫలితాలను పొందవచ్చు.
వృశ్చిక రాశి : వృత్తి ఉద్యోగాల్లో పై చేయి మీదే అవుతుంది. ఆప్తులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడినా సకాలం లో పూర్తి చేయగలుగుతారు. వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. అనుకోని ఇబ్బందులు రావటం వల్ల తగువులు పడతారు అందుకని జాగ్రత్తగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వారు కాస్త గమనించి వాహనాలను నడపగలరు. ఈ రాశి వారు సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయులకి వడ మాల సమర్పిస్తే లేదా అనాధ శవాలకి దహన సంస్కారం చేసిన లేదా చేపించిన అన్ని రకాల శుభాలు జరుగుతాయి. ఈ రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించటం ఉత్తమం.
ధనుస్సు రాశి : కొన్ని వ్యవహారాలు చికాకు పరుస్తాయి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. స్నేహితులతో వాదనలకి దిగటం మంచిది కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను అందరు గౌరవస్తారు. సమాజoలో మీకంటూ ఉన్న దీర్ఘ కాళిక సమస్యలను యుక్తితో పూర్తి చేసుకుంటారు. అది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు ఎంత కష్ట పడినప్పటికి నిరుద్యోగ విషయాలు కలిసి రాక బాధకి గురి కావాల్సి వస్తుంది. విదేశీ వ్యాపారాలు మరియు లావాదేవీలు సామాన్యంగా సాగుతుంది. ఈ రాశి వారు ఆంజనేయునికి సింధూరంతో పూజ చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గోసేవ చేసుకోవటం, పేద పిల్లలకు పాలను మరియు పాల కోవాలను పంచటం వల్ల మీ కోరికలను నెరవేర్చుకో గలుగుతారు.
మకర రాశి : జల వనరుల శాఖ వారికీ మరియు మత్య పరిశ్రమ వారికీ. వాటర్ బిజినెస్ వారికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగాల వారికి కొత్త పనులు అందటం వల్ల ఆనందంగా ఉండ గలుగుతారు. పాల వ్యాపారాలు. చేసే వారికి మంచి లాభాలు చేకూరె సమయం అని చెప్పవచ్చు. పశు వ్యాపారస్తులకు. పక్షులు పెంపుడు జంతువుల వ్యాపారస్తులకి మధ్యమిక ఫలితాలు వరిస్తాయి. ఆర్థిక వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. వీరు ఇంద్రాక్షి స్తోత్రం పారాయణ చేయటం వల్ల మరియు పక్షులకు ఆహారం తినిపించటం వల్ల అన్ని సిద్దిస్తాయి.
కుంభ రాశి : కొత్త పరిచయాల వళ్ళ సమస్యలను ఎదురుకుంటారు. ఆధ్యాత్మిక చింతన చేయండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మిత్రలతో స్వల్ప వాదనలకు గురి అవుతారు. వృత్తి వ్యాపారం లో నిరాశను మిగులుస్తాయి. విందు వినోదల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వీరు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించటం మంచిది.
మీన రాశి : ఈజీ మని కోసం అలోచించి కాలాన్ని శ్రమని వృధా చేసుకుంటారు నూతన కార్యాల గురించి సన్నిహితులతో నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులకు తగినంత ఆదాయం లభిస్తుంది. అధికారులతో విభేదాలు ఏర్పడుతాయి. భాగస్తుల మధ్య మాట పొంతన ఉండక పోవటంతో కాస్త కలవర పడతారు. నూతన ప్రయత్నాలు చేసి కుటుంబంని ఆనందింప చేస్తారు. ఈ రాసి వారు భగవత్ గీత పారాయణం చేయటం వల్ల మరియు పెళ్లి ఈడికి ఎదిగిన ఒక పేద అమ్మాయికి పెళ్లి సమాల్నా నిమిత్తం ఖర్చు భరించినట్లయితే అన్నింట విజయం సాదించ గలుగితారు. ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించటం మంచిది.* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002