* బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞+91 7013294002
మేషరాశి : వైద్య రంగం వారికి నూతన కార్యాల వల్ల సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందగలుగుతారు అని చెప్పవచ్చు. రాజకీయ రంగాల వారికి ఇంకాస్త సమయం అవసరం అవుతుంది, అందుకని మీరు అనుకున్న పనులు అయ్యేదాకా మీ ప్రణాళికలకు సంబందించిన విషయాలు గొప్యంగా ఉంచటం మంచిది. కర్మాగారాలలో పనిచేసే వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
వృషభ రాశి : అటవీ శాఖలో కదలికలు రావటం వల్ల పదవి చలనాలు ఉంటాయి. ఆర్థిక వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. పక్షులు పెంపుడు జంతువుల వ్యాపారస్తులకి మాధ్యమిక ఫలితాలు వస్తాయి. కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.ఈ రాశి వారు ఆంజనేయునికి సింధూరం తో పూజ చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మిథునరాశి : ఉద్యోగులకు అధికారులకు సఖ్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన చేయండి. దాని వల్ల మానసిక బలం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దానికి ఇప్పుడు బాధపడ్డ తరువాత మన మంచికే అయింది అని ఆనందిస్తారు. కొత్త పరిచయాల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. అందరిని గుడ్డిగా నమ్మి వెళ్ళటం మంచిది కాదని తెలుసుకోండి.
కర్కాటక రాశి : భాగస్తుల మధ్య మాట పొంతన ఉండక పోవటంతో కాస్త కలవర పడతారు. అధికారులతో విభేదాలు ఏర్పడుతాయి. హార్స్ రేసింగులు, పేకాటలు, లాటరీలు, బెట్టింగులు లాంటి ఈజీ మని కోసం అలోచించి కాలాన్ని, శ్రమని వృధా చేసుకుంటారు. నూతన ప్రయత్నాలు చేసి కుటుంబంని ఆనందింప చేస్తారు. నూతన కార్యాల గురించి సన్నిహితులతో నిర్ణయం తీసుకుంటారు.
సింహ రాశి : వీరు ఆర్థిక లావాదేవీల విషయాలు ఒకటికి పది సార్లు అలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు. నౌకాదళంలో వీరికి కొత్త పదవులు లభించే అవకాశం ఉన్నందుకు వారు మానసిక ఆనందానికి గురి అవుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువుల వల్ల ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి
కన్య రాశి : చిరు వ్యాపారస్తులకు నూతన టెండర్లు, ప్రాజెక్ట్స్ రావటం వళ్ళ ఒకింత సంతోషంగా ఉండగలుగుతారు. మీతో ఉంటూనే మిమ్మల్నే మోసం చేసే వారు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయం గమనించగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కానందున చికాకుతో మిత్రులతో స్వల్ప వాదనకి దిగటం మంచిది కాదు.
తులా రాశి : మీరు ఊహించని వారి నుండి ఊహించని విధంగా కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసు కుంటారు. అనుకున్న పనులు అవకపోవటంతో నిరాశకు గురి అవుతారు. దూర ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది
వృశిక రాశి : సంతానం విషయంలో కాస్త మనస్థాపనికి గురైవుతారు. సాంకేతిక విద్యార్థులకు అనుకూల సమయం, కష్టపడి చదుకుంటే విజయాన్ని సాధించ గలుగుతారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. వృత్తి వ్యాపార దారులు పై వారి నుండి ప్రశంసలు పొందుతారు. వికలాంగులకు చేయూత కర్రలు దానంగా ఇవ్వటం వల్ల కూడా సకల శుభాలను పొందవచ్చు.
ధనుస్సు రాశి : నూతన లైసెన్స్ లు మరియు లీస్ లను అనుకున్నవి దక్కించు కోగలుగుతారు. రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళలను ప్రదర్శించటానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. డిఫెన్స్, ఆర్మీ, సైన్టిస్టుల రంగాల వారికీ భాద్యతలు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలని సాదించ గలుగుతారు
మకర రాశి :కోర్టు వ్యవహారాలు తీరి మీకు ప్రశాంతత చేకూరుతుంది. చిరు వ్యాపారస్తులకు నూతన టెండర్లు ప్రాజెక్ట్స్ రావటం వల్ల ఒకింత సంతోషంగా ఉండ గలుగుతారు. మీతో ఉంటూనే మిమ్మల్నే మోసం చేసే వారు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కుంభ రాశి : ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలిగినప్పటికి కుటుంబం యొక్క సలహాలను పాటించటం వల్ల సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుని అర్థం చేసుకోగలుగుతారు, భవిష్యత్ కి సంబందించిన కీలక నిర్ణయాలు తీసుకో గలుగుతారు. లక్ష్యంపై ఏకాగ్రత పెంచుకోవాలి, కొన్ని విషయాలల్లో నిపుణుల సలహాల అవసరం పడవచ్చు.
మీన రాశి : పిల్లల యొక్క భవిష్యత్ ను గురించి కొత్త ప్రణాళికను సిద్ధం చేసుకున్నవారు అవుతారు. తీర్థ యాత్రలు చేస్తారు, ఆధ్యాత్మిక భావనలతో గడుపుతారు. చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు సానుకూలంగా మారగలిగే కాలం ఆసన్నమైనది అని గమనించ గలరు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం వల్ల కుటుంబంలో ఆనందాన్ని పెంచిన వారు అవుతారు. * బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు * వేములవాడ దేవస్థానం ప్రధాన అర్చకుల కుమారులు * యజుర్వేద పండితులు * గడచిన 75 సంవత్సరాలలో తెలుగు వాళ్లలో కాశీలో వేదిక్ సైన్స్, మరియు తంత్ర శాస్త్రంలో ఉతీర్ణత సాధించన ఏకైక వ్యక్తి * మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై యాగాలు చేసిన వ్యక్తి . Ph 📞 +91 7013294002