ప్రత్యేక కధనం: సీనియర్ జర్నలిస్ట్ ఆది …
వై అక్బరుద్దీన్ అక్యూజ్డ్ టూ ఎక్స్క్యూజ్డ్?
ఇదే కేసు కొట్టివేతను అడ్డు పెట్టుకుని ఇతర సామాజిక వర్గాల వారు చెలరేగిపోతే.. రేపు ఇదే తరహాలో మరొకరు ఇలాగే రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తే.. ఆ మతానికొక నీతి- మా మతానికొక నీతి అనే మాట ప్రచారంలోకి రాదా? అయినా సోషల్ మీడియాలో ఈ పాయింటాఫ్ వ్యూలో చర్చే లేదేంటి? అక్బరుద్దీన్ మాట్లాడితే పర్లేదా? ఆయన ముస్లిం కమ్యూనిటీకి కొమ్ము కాస్తుంటాడు కాబట్టి.. జానేదో కేటగిరిలో వదిలేయాల్సిందేనా? అన్న ప్రశ్నలకు చాలానే సమాధానం వెతకాల్సి ఉంది.. చాలా మందికి ఇక్కడే డౌట్ కొడ్తుంది.. వాళ్లు చేస్తే ఒక నీతి.. మేం చేస్తే ఒక నీతా? అన్నది ఎప్పటికీ ఒక మీమాంశే. ఇదే అంశం బండి సంజయ్, రాజాసింగ్ లాంటి వారి పాయింటాఫ్ వ్యూలో జరిగితే.. అది దళిత బహుజన మైనార్టీ ప్రజా సంఘాల నుంచి ఉవ్వెత్తున విమర్శలను ఎదుర్కునేదే.. అంతెందుకూ.. ఇటీవల రామ్ శోభాయాత్రలో రాజాసింగ్ వ్యాఖ్యలను కేటీఆర్ ఉదహరించారు కూడా. మీడియా పరంగా.. యాక్టివిస్టుల పరంగా.. ప్రొముస్లిం, ప్రో క్రిస్టియన్, ప్రొ దళిత్, ప్రొ ప్రొ ప్రొ నడుస్తూ ఉండే వర్గాలివి.. కారణం.. ఇప్పటి వరకూ అణగదొక్కబడ్డ వర్గాలుగా వీటికి ముద్ర.. అందుకే ఆసిఫా చనిపోతే ఒక ఉద్యమం.. అదేలా గీత మరణిస్తే ఒక ఉద్యమం.. ఫలానా యువకుడు దళిత్ గా చనిపోతే ఒక నియమం.. సాధారణ అగ్రకుల సంజాతుడైతే ఒక రూలింగ్.. ఏంటిలా? అన్నది ప్రస్తుతం రైట్ వింగు జనాలను పీడిస్తున్న ప్రశ్న..
ఇక్కడో సన్నటి రేక ఉంది.. రైటిస్ట్ లెఫ్టిస్ట్ అంటూ సమాజం రెండుగా చీలడం మాత్రమే కాదు.. ఆ రేఖ సన్నటి నుంచి లావుకు బలంగా విస్తరించి.. ఇప్పుడది.. అనకొండ స్థాయికి చేరిపోయింది.. ఒకప్పుడు కేవలం లెఫ్టిస్టు వింగులు దళిత బహుజన వర్గాలు మాత్రమే హైపర్ యాక్టివ్ గా ఉంటూ వచ్చాయ్.. కానీ నేటి పరిస్థితి అలా లేదు.. రైటిస్టులు కూడా బలంగానే వృద్ధి చెందుతున్నారు.. ఇపుడు వీరి కనెక్టివిటీ బాగానే విస్తరించింది.. ఎక్కడో బెంగాల్లో కొన్ని ఊళ్లలో హిందువులను ఖాళీ చేయిస్తున్నారన్నది కూడా వీళ్లు గుర్తిస్తున్నారు.. ఇంకా ఎక్కడెక్కడో జరిగే హిందూ వ్యతిరేక కార్యకలాపాలు వీళ్లకు కంఠోపాటం వచ్చు.. ఇలాంటి సమయంలో కోర్టు అక్బరుద్దీన్ చూపిన ఉదారత.. ఏమంత చర్చగా మారలేదు సరికదా.. కనీసం ఊసులో కూడా లేకుండా పోయింది.. అయితే ఇక్కడొకటుంది.. ఏ చర్చయినా మొదలు పెట్టేది దళిత బహుజన మేథో వర్గాల వారే.. వీరికి కౌంటర్లివ్వడం స్టార్ట్ చేస్తుంటాయి రైటిస్టు వింగులు.. ఎప్పుడైతే ఈ వైపు నుంచి చర్చ మొదలు కాలేదు.. అటు వైపు నుంచి కనీస ఆన్సర్లు కరవు.. దానికి తోడు రాజాసింగ్ లాంటి దుందుడుకు నోరున్న మనుషులు కూడా బాగానే జమయ్యారు.. దీంతో ఇసుక తక్కిడ పేడ తక్కిబ బాపతు పెరిగిపోతూ వస్తోంది.. లేకుంటే అక్బరుద్దీన్ అన్నమాటలు సామాన్యమైనవా? కానీ ఇక్కడ కోర్టు వాటిని కొట్టేయడంలో తొలుత ఫ్రీడం ఆఫ్ స్పీచ్ కింద తీసుకుని ఉండొచ్చు.. ఈ మధ్య ప్రశాంత్ భూషన్ లాంటి లాయర్ అన్న మాటలకు రూపాయ ఫైన్ వేయలేదా? అది కూడా ఆయన న్యాయ వ్యవస్థ మీద చేసిన కామెంట్.. ఇక రెండోది హేట్ స్పీచ్.. హేట్ స్పీచ్ మీద తీవ్రమైన చర్యలు తీసుకునేంతగా ఇంకా మన వ్యవస్థ అభివృద్ధి చెందలేదు.. ఎందుకంటే.. హేట్ స్పీచ్ భారతదేశంలో జరిగినంత గొప్పగా మరెక్కడా జరగదు..
ఇక్కడ హేట్ స్పీచ్ ఓపెన్ కేటగిరిలో నడిచే ఒకానొక నిరంతర ప్రక్రియ.. దానికి తోడు ఇటీవల సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీం సైతం సమర్ధించిన సంగతి తెలిసిందే.. దానికి తోడు అక్బర్ చేసిన వ్యాఖ్యలను కోర్టుగానీ సీరియస్ గా తీసుకుని ఉంటే..
సుమారు రెండేళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష తప్పేది కాదు.. ఇప్పటికే 40 రోజుల పాటు ఈ కేసు విషయంలో జైల్లో ఉండి వచ్చిన ఆయన మరి కొన్నాళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చేది.. ఈ లోగా.. ఇక్కడి ఎన్నికలు కూడా ముగిసిపోయేవి..
కానీ.. కానీ.. ఓల్డ్ సిటీ ఒక్కసారిగా అట్టుడికి పోతుంది.. దేశ వ్యాప్తంగా ఇదొక మూమెంట్ గా తయారవుతుంది.. దానికి తోడు ఎంఐఎం ఇటీవల దేశ వ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరిస్తూ వస్తోంది.. ఈ కండీషన్లో.. రాముడి జన్మకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినా దేశ భద్రతకు రిలేటెడ్ గా సన్సేషనల్ కామెంట్స్ చేసినా.. ఎందుకో కోర్టు.. పోనీలే అని కొట్టి పారేసింది.. ఈ విషయంలో హిందూ సమాజం కూడా ఏమంత సీరియస్ గా తీసుకోలేదు.. ఎందుకంటే ఇటు వైపు కూడా సరిగ్గా ఇలాంటి వాచాలతే నడుస్తోంది.. గ్రేటర్ ఎలెక్‌సన్లో బండి మాటలు దేశ సరిహద్దులు దాటాయ్.. పాతబస్తీలో ఏకంగా పాకిస్థాన్ ఆఫ్గనిస్థాన్లు వెలిశాయ్.. దానికి తోడు రాజాసింగ్ ఇలాంటి కామెంట్లకు తరచూ కేరాఫ్ గా నిలుస్తున్నారు.. ఈ కోణంలో చూస్తే హిందూ సంఘాలు వారి తాలూకూ నాయకులు కూడా కోర్టుకు రెగ్యులర్ కస్టమర్లు కావల్సి వస్తుంది..
దీంతో అక్బరుద్దీన్.. అంత ఘాటైన పదజాలం వాడినా ఒక జాతిపై తీవ్ర వ్యతిరేక భావజాల ప్రదర్శన చేసినా అదంతా దూదిపింజలా తేలి పోయింది.. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరక్కూడదని భావిద్దాం…
ప్రత్యేక కధనం: సీనియర్ జర్నలిస్ట్ ఆది …