World Photography Day 2021, Minister V Srinivas Goud, Telangana Poltical News, TUWJ, Photo Journalist, Mamidi Harikrishna, Telugu World Now,
ఒక్క ఫోటో లక్ష మెదళ్ళను కదిలిస్తుంది World Photography Day: మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, కాంటెస్ట్ ను హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు. ఫోటో గ్రాఫర్స్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ఫోటోలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం లో ఫోటోగ్రఫర్స్ పాత్ర ఎంతో గొప్పదన్నారు. సీఎం కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల కు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలో జర్నలిస్టుల కుటుంబాలకు బాసటగా నిలిచారన్నారు. ఒక్క ఫోటో లక్ష మెదళ్ళను కదిలిస్తుందన్నారు. ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో విరహత్ అలీ TUWJ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ ధర్మాన, కార్యదర్శి రజనీకాంత్ గౌడ్, కోశాధికారి శివకుమార్ , సభ్యులు నగర గోపాల్, వెంకట్, సతీష్, శ్రీను, దీపక్ దేశ్ పాండే, అలీ, రాజేశ్వర్, G. శ్రీను తదితరులు పాల్గొన్నారు.