Bhakthi హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపే వినాయక చవితిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు సాధారణంగా 8 రోజులు పాటు వినాయకుడి పూజలు జరిపి 9 రోజున వినాయకుడి నిమజ్జనం చేస్తారు.. రోడ్లపై ఘనంగా వినాయకుడు ఊరేగింపు పూర్తి చేసి. ప్రవహిస్తున్న నదులు లేదా కాలువలు సముద్రంలో వినాయకుని నిమజ్జనం చేస్తాం.. అయితే అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ నిమజ్జనం వెనుక ఎంతో ఆంతర్యం దాగి ఉంది.. ఇందులో ఎంతో మహత్యం దాగి ఉంది..
సాధారణంగా ఏ దేవుడి విగ్రహాన్ని అయినా మట్టితో తయారు చేస్తే దానికి ఎనిమిది రోజులు మాత్రమే దైవగుణం ఉంటుందని… తర్వాత అందులో శక్తి మాయమవుతుందని హిందూ సాంప్రదాయంలో ప్రగాఢ నమ్మకం.. అందుకే వినాయక, దుర్గాదేవి విగ్రహాలను 9వ రోజున నీటిలో నిమజ్జనం చేస్తారు..
వినాయకుని ఇంట్లో పూజించి నిమజ్జనం కొరకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.. అలానే వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. వినాయక విగ్రహాలు తయారు చేయటానికి కావలసిన మట్టిని చెరువులు, కాలువల నుంచి తీసుకుంటారు. మళ్ళీ ఈ విగ్రహాలని అందులోనే నిమజ్జనం చేయడం వల్ల నీరు ప్రవహించడానికి ఎటువంటి ఆటంకం ఉండదని ప్రగాఢ నమ్మకం అంతేకాకుండా వినాయకుడితో పాటు నీటిలో కలిపే గరిక పత్రి లాంటి వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అవన్నీ నీటిలో కలిసి అందులో ఉన్న క్రిములను ను చంపుతాయని నమ్ముతారు. చూశారా హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదో..


























