About Us

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

వర్తమానంలో.. మీడియా సంస్థలు పార్టీలకు కులాలకు ముడిపడి వార్తలను చూసే దృష్టిని సంకుచితం చేసేశాయి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా.. సమకాలీన విషయాల మీద సీనియర్ పాత్రికేయుల దృక్కోణానికి ‘ఏది అనిపిస్తే’ అది పాఠకులకు తెలియజెప్పడం మా లక్ష్యం.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. [email protected] చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

నిష్పాక్షికంగా ఉన్నంత వరకు.. అలాంటి విశ్లేషణలను కోరుకునే పాఠకలోకానికి చేరువ కాగలం అనేది మా నమ్మకం. మమ్ముల్ని ప్రోత్సహించండి. ఈ వెబ్‌సైట్ లోని వార్తలు, కథనాలు మీకు నచ్చితే.. వార్త లింక్ ను మీ పరిచయస్తులకు కూడా తెలియ చేయండి. సోషల్ మీడియా ద్వారా ఆ అంశాలు పదిమందికీ తెలిసేందుకు సహకరించండి.

.. ఎడిటర్