movie ప్రిన్స్ మూవీ ద్వారా త్వరలోనే టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్.. యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసినా తక్కువ కాలంలోనే కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. త్వరలోనే ప్రిన్స్ మూవీతో అలరించునున్నాడు. అయితే ప్రిన్స్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.. ఈ సందర్భంగా శివ కార్తికేయ రెమ్యూనికేషన్ విషయమై పెద్ద చర్చ నడుస్తుంది. ప్రిన్స్ మూవీ కోసం ఏకంగా 30 కోట్లు రెమినేషన్ తీసుకుంటున్నట్టు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాతోనే తను టాలీవుడ్ లో మార్కెట్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇంతవరకు ఆయన తన రేమినేషన్ 23 కోట్ల వరకు తీసుకొని తీసుకునేవాడని.. కానీ ఈ సినిమా నుంచి మాత్రం 30 కోట్ల పెంచేసాడని సమాచారం.
దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రిన్స్ మూవీ. ఇందుకోసం ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న మూవీ టీం రిలీజ్ కు సిద్ధమైంది. జాతి రత్నాలు ఫేం అను దీప్ కేవీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ తర్వాత మరో మూవీ చేయనున్నట్టు తెలుస్తుంది. మహావీరుడు టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ టైటిల్ ప్రోమో ఇప్పటికే ఆకట్టుకోగా శివ కార్తికేయన్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి.

























