Movie ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్అ. యితే ఈ సినిమాపై మొదటి నుండి అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆడియన్స్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈమూవీ థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ఆడియో సాంగ్స్ ని కూడా నేడు చెన్నై లో నెహ్రు స్టేడియంలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేసింది యూనిట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది.
ఈ వేడుకకి కోలీవుడ్ స్టార్స్ హీరోస్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ గెస్ట్ లు గా వచ్చారు. అయితే తన అభిమాన హీరోల్ని ఇద్దరినీ చూసేటప్పటికి జనాలు విపరీతంగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు అలాగే వన్ చూసేందుకు ఎగబడ్డారు. అయితే ఈ విషయాన్ని ముందే ఊహించి గట్టిగా పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేసారు. కాసేపటి విరామంలోనే ముందుగా రజినీకాంత్, ఆ తరువాత కమల్ హాసన్ ఇద్దరూ ఈ వేడుకకి గ్రాండ్ రాయల్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం హర్షద్వానాలతో మారుమ్రోగింది. ప్రస్తుతం ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుండగా మరికొద్దిసేపటిలో ఆడియో తోపాటు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

























