Movie ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే సినిమా అప్పట్లో ఎంతో సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ స్టార్ గా స్థిరపడిపోయాడు అయితే ఈ సినిమా వల్ల ఉదయ్ కిరణ్ రీమాసేన్ కు ఎంత పాపులారిటీ వచ్చిందో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించిన సుహని కి కూడా అంతే పాపులారిటీ వచ్చింది ఇప్పటికి కూడా పాపను ఎవరు మర్చిపోలేరు. తూనీగ తూనీగా పాటలో అలరించిన ఈ పాప ఇప్పుడు ఎంతో మారిపోయింది. అయితే తాజాగా ఆమె పెళ్లి కూడా అయిపోయింది.
రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించిన పాప పేరు సుహాని. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె తర్వాత గణేష్.. ప్రేమంటే ఇదేరా.. ఎదురులేని మనిషి వంటి సినిమాల్లో బాలనటిగా పించింది తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె ప్రస్తుతం మ్యూజిషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో కలిసి ఏడు అడుగులు వేసింది.
అయితే చాలా తక్కువ మంది బంధువులు మిత్రుల మధ్య వీళ్ళ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి మాల్దీవ్లో జరిగింది. అయితే పెళ్ళికొడుకు ఢిల్లీలో ఓ కంపెనీని నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన చాలామంది.. సుహాని అసలు గుర్తుపట్టలేకపోతున్నాం.. చాలా మారిపోయింది.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ క్యూటీ.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు..

























