Movie రెబెల్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో కృష్ణంరాజు సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయిన ఈయన సినీ జీవితం కోసం అందరికీ తెలిసు. దాదాపుగా 200 చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం కోసం అంతగా ఎవరికి తెలియదు..
కృష్ణంరాజు 1969లో తన 29 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య పేరు సీతాదేవి. వీరికి ఒక కుమార్తె ఉంది. 1995లో ఒక కారు ప్రమాదంలో సీతాదేవి మరణించడంతో కృష్ణంరాజు ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు ఆయన మానసిక పరిస్థితి బాగోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు రెండో పెళ్లి చేయాల్సి వచ్చింది.. అయితే 1996లో ఆంధ్రప్రదేశ్.. తూర్పు గోదావరిజిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజు రెండో పెళ్లి జరిగింది. శ్యామలాదేవి కృష్ణంరాజు కంటే 28 ఏళ్లు చిన్నది. వీళ్లకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి..
ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. తెలుగు చిత్ర సినిమాలో చెరగని ముద్ర వేసిన కృష్ణంరాజు చివరి రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. కోవిడ్ అనంతరం వచ్చిన ఆరోగ్య సమస్యలతో బాధడుతున్న ఈయనను గచ్చిబౌలిలోని ఏఐసీఐ హాస్పిటల్లో చేర్చారు. అయితే సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈయన మరణించినట్టు వైద్యులు తెలిపారు.

























