Movie టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే త్వరలోనే ఈ సినిమా ఖైదీ నెం.150 వసూళ్లను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల సంఖ్య కూడా పెంచడంతో ఇంకో రూ.50 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టం కాదు అనేది విశ్లేషకులు అంటున్నారు..
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ ఐదు న విడుదలైన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకుంది.. ఏదేమైనా చాలా కాలం తరవాత మళ్లీ మెగాస్టార్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది.
దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా లో పక్క పొలిటికల్ పాత్రలో కనిపించారు చిరు. రాష్ట్ర రాజకీయాల్ని ఏకచక్రంగా శాసించే వ్యక్తి వెనుక ఉండి నడిపించే పవర్ఫుల్ పాత్రలో కనిపించారు చిరంజీవి. లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించారు. మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించారు. ఈ సినిమా హిట్ తో చిరు అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా మంచి జోష్ మీద ఉన్నారు..

























