Crime News : కొన్ని సామెతలు వినడానికి భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఒక సామెత “వచ్చేది రాకుండా పోదు ఉండేది పోకుండా పోదని” ఏంటబ్బా సామెతలు చెబుతున్నారు ఏంటో అని అనుకుంటున్నారా. ఎంత కష్టపడి సంపాదించిన అప్పులు ఉంటే కష్టపడిన సంపాదన అప్పులకే పోతాయి మీ కష్టం కనిపించదు అనే చెప్పుకోవచ్చు. అప్పుల బాధతో ఎంతోమంది మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు మనం చూస్తూనే ఉంటున్నాం. తీసుకున్న అప్పు కాస్తుంటే దాని వడ్డీ మాత్రం బారెడంత ఉంటుంది.
కడప జిల్లాలో ఇటువంటి దారుణమే జరిగింది భర్త కువైట్‌కి వెళ్లి సంపాదించిన సంపాదన అంతా అప్పులకే సరిపోతుంది. మళ్లీ డబ్బు సంపాదన కోసం వెళతాను అని భార్యతో చెప్పడంతో భర్త వెళ్లడం ఇష్టం లేని భార్య మనస్తత్వానికి గురై ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే…రామాపురం మండలంలోని రాచపల్లె పంచాయతీ గంగనేరు క్వార్టర్స్‌కు చెందిన మల్లిక సుబ్బలక్ష్మమ్మ భర్త రమణ జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లారు.ఈ ఏడాది మార్చిలో కువైట్ నుంచి ఇంటికి వచ్చా రు. అక్కడ సంపాదించిన సంపాదన అంతా అప్పులు తీర్చడంలో పెట్టిన అప్పులు తీరకపోగా అది కాస్త ఎక్కువ అవ్వడంతో డబ్బు సంపాదన కొరకు మళ్లీ కువైట్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
భర్త కువైట్‌కు వెళ్లడం ఇష్టం లేని సుబ్బలక్ష్మమ్మ భర్తను కువైట్‌కు వెళ్ళవద్దని ఇంటి దగ్గరే ఉండి కూలి పనులు చేసుకుందామని చెప్పిందట.. అందుకు భర్త సహకరించకపోవడంతో సుబ్బలక్ష్మమ్మ మనస్తాపం చెంది విషమాత్రలను మింగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు శవపరీక్ష కోసం లక్కి రెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగిందని ఎస్ఐ జయరాములు తెలపడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.