Crime news: ప్రేమ ఈ రెండక్షరాల కోసం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటారు. మరికొందరు సంతోషంగా జీవిస్తారు. ఇష్టపడిన వ్యక్తి దూరమైపోతుంటే ఆ బాధలో ఏం చేస్తారు వారికే తెలియదు తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా రైలు పట్టాలు ఎక్కి కూర్చుంటారు లేదా ఫ్యాన్ కి ఉరి వేసుకుంటారు. అయితే ఇటువంటి సంఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కథనం లోకి వెళితే…
నెల్లూరు జిల్లాలో ఉలవపాడు గ్రామానికి చెందిన కుంచాల భార్గవి (19) కుటుంబం దర్గా సెంటర్లో నివాసం ఉంటున్నారు అయితే అదే కాలనీకి చెందిన మాల్యాద్రి, భార్గవి గత గత కొన్నాళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకున్న అని కూడా నిర్ణయించుకున్నారు అయితే ఇంతలో ఏమైందో తెలియదు గానీ మాల్యాద్రి ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు..నన్ను బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని భార్గవిని బెదిరించాడు. దీంతో మనస్తపనికి గురైన భార్గవి ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది.
అయితే 10వ తేదీన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భార్గవి ఇంటికి వెళ్ళగా ఆమె సమస్యను తెలుసుకున్న వెంటనే అక్కడ ఉన్న ఎస్పీని నాలుగు రోజులు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది. కానీ ఇంతలో భార్గవి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాద వాతావరణం చేకూరింది. ఆత్మహత్య చేసుకున్న భార్గవి మృతదేహాన్ని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త ఆ గ్రామంలో దుమారం రేపుతుంది.