Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే పుష్ప సినిమాకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు బన్నీ. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడు కావడంతో బన్నీ మరింత వైరల్ అవుతున్నాడు. అభిమానులు, ప్రేక్షకులు, అన్ని పరిశ్రమల నుంచి సెలబ్రిటీలు అల్లు అర్జున్ కి అభినందనలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ దశలో ఉంది. బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లి మరీ అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ కొరటాల శివ, దేవర నిర్మాత సుధాకర్ మిక్కిలినేనితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. కాసేపు బన్నీతో ముచ్చటించారు కొరటాల శివ. దీంతో కొరటాల అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని, అందుకే నిర్మాతని కూడా తీసుకెళ్లాడని టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో గ్రాండ్ గా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల ఇంకా ఏది ఫైనల్ చేయలేదు. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, సందీప్ వంగలతో సినిమాలు లైన్లో పెట్టాడు బన్నీ. మరి బన్నీ కొరటాలకు ఛాన్స్ ఇస్తాడా చూడాలి. ఆచార్య ఫ్లాప్ అవ్వగా దేవర రిజల్ట్ పైనే కొరటాల నెక్స్ట్ సినిమా ఆధారపడి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ – కొరటాల కాంబోలో కూడా సినిమా వస్తే మంచిదే అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ కాంబోలో సినిమా వస్తుందా రాదా?