Health మలబద్ధకంతో బాధపడే వారు చాలా మందే ఉంటారు. కానీ… ఆ విషయాన్ని బయటకు చెప్పుకునేందుకు, వైద్యుల్ని సంప్రదించేందుకు సైతం చాలా మంది వెనుకడుకు వేస్తుంటారు. కానీ.. సరైన సమయంలో వైద్యుల్ని సంప్రదించి.. వారి సూచనలు పాటించకపోతే మరింత ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అంటున్నారు… వైద్యులు. అలానే… ప్రస్తుత జీవన శైలికి తగినట్లుగా తీసుకుంటున్న ఆహారపు అలవాట్లును కాస్త పక్కన పెట్టి… ఆరోగ్యానికి సహకరించే మంచి ఆహారం తీసుకోవాలని, మలబద్ధకాన్ని దూరం చేసే ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలని సలహా ఇస్తున్నారు. అలానే… కొన్ని రకాలైన ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదంటున్నారు. అలాంచి వాటిలో ఏఏ ఆహారానికి దూరంగా ఉంటే మంచిదో.. మీరే చూసేయండి.
శరీరంలోని వేడి వల్ల ఒంట్లోని నీరు శాతం తగ్గిపోతుంది. దాంతో డీహైడ్రేషన్ ఏర్పడి మలబద్ధకం సమస్యకు కారణమవుతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే తగినంత నీరు, పానీయాలు తాగాలి. అదే సమయంలో ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనే విషయమూ ముఖ్యమే. ఇప్పటికే మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్లు… పీచుపదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. రాత్రి, ఉదయం వేళల్లో మెంతుల్ని నీళ్లలో నానబెట్టి ఆ మెంతుల్ని తీసుకుంటే… శరీరంలోని వ్యర్థాలు సులువుగా వెళ్లిపోతాయి. జీలకర్ర ఆరోగ్యానికి మంచిదే అయినా… డీహైడ్రేషన్ కలిగిస్తున్న కారణంగా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్లు జీలకర్రను దూరం పెట్టాలి. ఎండలు మండిపోయే కాలంలోనూ కాఫీని ఆస్వాధించే వాళ్లుంటారు. కానీ ఇది డీహైడ్రేషన్ ను కలిగించి… మలబద్ధకం సమస్యను పెంచుతుంది. కాబట్టి, ఇప్పటికే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి


























