Crime ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. ఏంటి మనుషులు ఇలా మారిపోతున్నారు అనిపిస్తుంది.. రోజూ వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే నేటి సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా లేకపోతే మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలా అనిపించక తప్పదు. ఇంత కర్కశంగా ప్రాణాలు ఎలా తీయగలుగుతున్నారు అనిపిస్తుంది.. ఎంతో రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే తాజాగా ఓ ఇంట్లో జరిగింది.
భోజనం విషయంలో తలెత్తిన చిన్న గొడవ ఎక్కడ వరకు దారి తీసింది చివరకు వంట మనిషి గొడ్డలితో ఇంటి యజమానులు నరికి చంపాడు చివరకు చిన్న పిల్లలను కూడా చూడకుండా పిల్లలపై కూడా దాడి చేశాడు అయితే ఈ దాడిలో పాప గాయపడగా బాబు తప్పించుకొని పారిపోయాడు ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది.
పని మనిషి.. నిందితుడు.. సత్యేంద్ర లక్రా కొన్నాళ్ల క్రితం రిచర్డ్, మెలేని మింజ్ దంపతుల వద్ద వంట మనిషి గా పని చేస్తూన్నాడు. అయితే భోజనం విషయంలో రిచర్డ్, వంట మనిషికి మధ్య గత కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ గొడవలో సత్యేంద్రను రిచర్డ్ హెచ్చరించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న సత్యేంద్ర ఎలాగైనా కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలి అనుకున్నాడు. అవకాశం చూసి పదునైన గొడ్డలితో రిచర్డ్ దంపతులను దారుణంగా నరికి చంపేశాడు. చిన్న పిల్లల పైన కూడా కనికరం చూపకుండా దారుణంగా దాడి చేశాడు. బాలుడు తప్పించుకొని పారిపోగా.. ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు నిందితుని అరెస్టు చేశారు.