Crime ఇన్స్టంట్ లోన్ యాప్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్పి సిహెచ్ విజయరావు ప్రజలకు హెచ్చరించారు. ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో లోన్ యాప్ ల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేశారు..ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇన్స్టెంట్ గా లోన్ వస్తుంది కదా అని ఆశపడి ఎవరైనా ఆ యాప్లను ఇన్స్టాల్ చేసుకున్నా… అక్కర్లేని లింకులపైన క్లిక్ చేసిన మొత్తం మీ డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని హెచ్చరించారు.
సైబర్ నేరాలు విషయంలో రోజు ఎంతోమంది మోసపోతున్నారని వార్తలు వస్తున్నా ఇలా మోసపోతున్న వారి సంగతి మాత్రం సంఖ్య మాత్రం తగ్గటం లేదన్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లు వెంటనే లోన్ వస్తుంది కదా అని ఆశపడి వాళ్ళు చెప్పినట్టు ఏవో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవటం.. ఓటిపిలు చెప్పటం వంటివి చెయ్యొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజలు వినడం లేదు.. ఇలా వాళ్ళు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీ వాట్సాప్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం, గ్యాలరీలో ఉన్న ఫోటోలు, మొత్తం కాంటాక్ట్స్ తో సహా వారికి వెళ్ళిపోతాయి. వెంటనే వాళ్లు చెప్పినంత మొత్తం కట్టకపోతే వీటన్నిటిని బయటపెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా అక్కర్లేని అడ్వర్టైజ్మెంట్స్ లింకులు కనిపిస్తూ ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకున్నా పెను ప్రమాదం తప్పదని సైబర్ క్రైమ్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇలా రోజూ ఎంతోమంది మోసపోతు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు..