Health మధుమేహం ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. చిన్న వయసులో ఉన్న వాళ్లే దీనికి గురౌతుండటం ఆందోళన కలిగించే విషయమే. అయితే మధుమేహం మరీ భయపడాల్సిన అంత సమస్య కాదని.. కొన్ని ఆహర నియమాలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు..
మధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారాన్ని తీసుకోవడం మానకూడదు. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిని మరింత పెరిగే ప్రమాదం ఉంది.. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ సమస్య ఉన్నవాళ్లకి ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఇలాంటి సమయంలో ఏదో ఒకటి కాకుండా బాడీకి సరిపడే ఆహారాన్ని తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవాలి. వీళ్లు బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
ఈ సమస్య ఉన్నవారు శరీరాన్ని ఎటూ కదల్చుకుండా ఉంచడం అంత మంచిది కాదు. అందుకే రోజులో ఎంతో కొంత సమయం తప్పకుండా వ్యాయామానికి కేటాయించాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉంటారు. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహ సమస్య ఉన్నవారు పండ్లు తీసుకోవచ్చా అంటే కచ్చితంగా కొన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు.. అవి ఏంటంటే నేరేడు పండు, ఆపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీ, నారింజ, అవోకాడో, దానిమ్మపండు, చెర్రీస్ వంటి పళ్ళను తీసుకోవచ్చు వీటివల్ల శరీరానికి కావాల్సిన పీచు సక్రమంగా అందుతుంది.


























