Health Tips: నిత్యం ఉపయోగించుకునే వాటిలో అల్లం ఒకటి మసాలా దగ్గర నుంచి ఉదయం టీ వరకు అల్లం వేసుకుంటారు.అల్లంతో పాలు కలిపి తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.వర్షాకాలంలో అల్లం యాంటీబయాటిక్స్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద రంగంలో అల్లం ప్రథమ స్థానాన్ని కలిగి ఉన్న విషయం తెలిసిందే. అటువంటి అల్లం యొక్క అనేకమైన ప్రయోజనాలు తెలుసుకోండి మరి.
ప్రస్తుతం అనేకమైన రోగా లు బారిన పడుతున్నారు వాటి బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునే వాటిలో అల్లం కూడా ఒకటి. అల్లం రోజు తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలానే గొంతు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.ఉదయాన్నే పొట్ట శుభ్రం చేయడంలో అల్లం సంజీవనిలా పనిచేస్తుంది. మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు దగ్గర వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్య నుంచి దూరం చేసుకోవాలంటే పాలల్లో లేదా టీలో రోజు అల్లం వేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లం కాస్త తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా అధిక బరువు వంటి సమస్యల నుంచి మంచి ఫలితం లభిస్తుంది. మరి ముఖ్యంగా తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీసుకునే టీలో అల్లం ఉండేలా చూసుకుంటే తలనొప్పి అనేది చిటికెలో మాయమైపోతుందట. అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం నిపుణులు తెలుపుతున్నారు. ఇది కేవలం అల్లం యొక్క సుగుణాలు మాత్రమే తెలపడం జరుగుతుంది. ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యులు సంప్రదింపవలెను.