Health కోపం.. ప్రతి ఒక్కరిలో సాధారణంగా కనిపించే ఫీలింగ్.. ఆనందం, బాధ ఎలా కలుగుతాయో కోపం కూడా అలాగే కలుగుతుంది. అయితే ఈ కోపమనేది కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకునేదిగా ఉంటే… ఇంకొన్నిసార్లు అదుపుతప్పుతుంది. దీనివలన ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బంధాలు తెగిపోతాయి కూడా.. ఇలాంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.
కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. సమస్యలు తెలియకుండానే చుట్టుముడుతుంటాయి.. ముందుగా కోపం వస్తున్నప్పుడు తమని తాము కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్ తీసుకోవటం అవసరం. దీనివలన అనవసరమైన యాంగ్సైటి తగ్గిపోతుంది. కాసేపు డీప్ బ్రీత్ తీసుకొని ఉండటం వల్ల మనిషిలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది.. అలాగే ప్రతిరోజు తగినంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. ఉదయాన సూర్యోదయం సమయంలో కాసేపు పచ్చగడ్డి పైన నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎంత ఉరుకుల పరుగుల జీవితం అయినా కాసంత మనకు మనం సమయం కేటాయించుకోగలగాలి అప్పుడే ప్రశాంతంగా ఉండగలం..
మ్యూజిక్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెలోడీలు, సీథింగ్ పాటలు మనసు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తాయి. బాగా కోపంగా, ఆందోళనగా అనిపించినపుడు ప్రశాంతంగా పడుకొని మ్యూజిక్ వింటాం చాలా రిలాక్స్ ఇస్తుంది. ప్రతిరోజు మీతో మీరు కొంత సమయం కచ్చితంగా గడపాలి. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ నవ్వుకునే ఒక చిన్న స్మైల్ రోజంతా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది..


























