Bhakthi కృష్ణయ్య.. చిన్ని కృష్ణుడు.. యశోద కృష్ణుడు.. గోపికల కృష్ణుడు.. రాధాకృష్ణుడు.. యాదవ కృష్ణుడు.. చిన్ని కృష్ణయ్య.. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం కృష్ణయ్య… ప్రేమకి, అపురూపానికి, స్నేహానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తిత్వం కృష్ణుడి సొంతం.. అటువంటి కృష్ణ తత్వంలో ఆ నమ్మకంలో ఉండే ఆనందమే వేరు..
చాలామంది కృష్ణుడి మాలను ధరిస్తుంటారు.. ఇందులో తులసి మాల, చందనం మాల, జపమాల వంటి చాలా ఉంటాయి.. అయితే ఈ మాలలు ధరించడం వెనక ఉండే ఆంతర్యం ఏమిటంటే.. మొక్కలు అన్నిటిలో అత్యంత పాజిటివ్ ఎనర్జీ తులసికి ఉంటుంది. ఆ తర్వాత స్థానం చందనం ఆక్రమిస్తుంది. అందుకే తులసిమాల మెడలో వేసుకోవడం వల్ల మన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని కృష్ణ భక్తులు నమ్మకం.. అయితే ఈ తులసిమాలకు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. అప్పుడే మనకు వాటి పూర్తి ప్రభావం తెలుస్తుంది. తులసిమాలు ధరించిన వాళ్ళు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ఆహారంలో అల్లం, వెల్లుల్లి తీసుకోరాదు.. అలాగే మాంసాహార పదార్థాలను తీసుకోరాదు.. చాలా నియమనిష్టలతో ఉన్నప్పుడే తులసిమాల ప్రభావం పూర్తిగా ఆ వ్యక్తిపై ఉంటుంది. నిజంగా ఇవన్నీ పాటిస్తూ తులసిని ధరిస్తే ఎంతో ప్రభావం ఉంటుందని కృష్ణ భక్తులు నమ్మకం. అయితే తులసిమాల వంటిదే చందనం మాల కూడా. కానీ వీళ్ళు ఏమంటారు అంటే.. చందనం మాలకు అన్ని నియమాలు పాటించాల్సిన అవసరం లేదని ఎవరైనా చెప్తుంటారు..
వెన్నలాంటి స్వచ్ఛమైన మనసుతో.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచిన కృష్ణుడి తత్వం ఎప్పటికీ చిరస్మరణీయమే.. ప్రేమను పంచడంలో, స్నేహం చేయడంలో కృష్ణుని మించిన వాళ్లు ఎవరూ లేరని చెప్తారు.. విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా కొలిచే కృష్ణుడు అంటేనే ఆనందానికి ప్రతీక. అతని జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం..


























