Health ఈరోజుల్లో చాలామంది పిల్లలను సక్రమంగా పెంచుతున్నాం అనుకుంటారు. కానీ తాజాగా ఒక సర్వేలో తెలియని విషయం ఏంటంటే పిల్లల్ని పెంచడం అనేది అందరికీ రాదని.. తాము చేస్తున్నది కరెక్టే అని భ్రమలో ఉండి పిల్లల్ని మరింత క్రమశిక్షణలో ఉంచటం పెను ప్రమాదానికి దారి తీస్తుందని తేలింది..
నిజానికి 30 ఏళ్ల క్రితం వున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చింది. కాలం చాలా వేగంగా పరిగెత్తుతుంది.. ఈ డిజిటల్ కాలంలో చిన్నపిల్లలు ఆండ్రాయిడ్ ఫోన్లు, లాప్టాప్ లు వాడటం సర్వసాధారణం అయిపోయింది, దీంతో వీళ్ళు చాలా తేలికగా సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్నారు,ఇది తల్లిదండ్రులకి కోపం తెప్పించిన విషయం అయినప్పటికీ ఈ విషయంలో పిల్లల్ని కంట్రోల్ చేయాలి.. వాళ్ళ మీద అరిచేసి గోల పెడితే వాళ్ళ వయసుకి అర్థం కాదు. అందుకే వాళ్లకి ఏ విషయం అయినా నెమ్మదిగా చెప్పాలి. పిల్లల్ని ముందు నుంచి క్రమశిక్షణ అలవాటు చేయాలి. అది కూడా ఒక పద్ధతిలో ఉండటం మంచిది. అతి గారాభం చేసిన.. అతి క్రమశిక్షణ చేసిన తర్వాత వాళ్ళు మానసిక స్వభావం చాలా దెబ్బతింటుందని సర్వేలు చెప్తున్నాయి..
వాళ్ళు ఏ విషయమైనా తల్లిదండ్రులతో పంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి.. అప్పుడే బయట బంధాలకు అట్రాక్ట్ అవకుండా ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో సంబంధాలు సరిగా ఉండవో.. అప్పుడే పిల్లలు బయట తోడు వెతుక్కుంటారు. ముఖ్యంగా తరచూ పిల్లలు ముందు గొడవలు పడితే అది వాళ్లని చెప్పుకోలేని మానసిక క్షోభకు గురిచేస్తుంది.. చదువుకునే పిల్లలకు వీలైనంత ప్రశాంత వాతావరణ కల్పించాలి. తల్లి తండ్రి సమస్యలు ఆర్థికంగా ఉంటే అవి పిల్లల వరకు రానివ్వకపోవటమే మంచిది.


























