crime రోడ్డుపై వెళ్తున్నప్పుడు బాధ్యతగా ఉండటం తప్పనిసరి.. అదృష్టం అన్నివేళలా కలిసి రాదు. కానీ ఒక మహిళ పెను ప్రమాదం నుంచి క్షణకాలంలో తప్పించుకుంది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
రోడ్డు దాటుతున్న ఒక మహిళ మీదకు అకస్మాత్తుగా కారు దూసుకొచ్చింది.. కారుకు ముందు అగి ఉన్న ఆటో కూడా ఆమె మీదకు తీసుకొచ్చాయి.. అయితే ఈ రెండు ఆమె పక్క నుంచి వెళ్లిపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. లేదంటే క్షణకాలంలో ఎంత ఘోరం జరిగేదో మనం ఊహించుకోవచ్చు.. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపిఎస్ అధికారి టిఎస్ఆర్ టి సి ఎండి సీపీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. క్షణకాలంలో తప్పించుకున్నారు.. ఎంతకాలం అని ఇలా అదృష్టం మీద ఆధార పడతాం.. అంటూ ట్వీట్ చేశారు.
Narrow escape but how long do we depend on luck?
Be responsible on Roads #RoadSafety pic.twitter.com/JEck2aXIuK
— Office of V.C. Sajjanar, IPS (@SajjanarOffice) September 1, 2022
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రోడ్లపై చాలా అజాగ్రత్తతో వెళ్తున్నారు.. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.. ఇది భారత్ లో మరింత ఎక్కువగా ఉంది.. నడుచుకొని వెళ్ళినా, ఏ వాహనంపై వెళ్ళినా ఎలాంటి రోడ్డు నియమాలు పాటించడం లేదు.. ఒక్కోసారి పూర్తి తప్పు ఎదుటి మనిషి వైపే ఉన్నా దాని ఫలితం మాత్రం ఇంకొకరు అనుభవించాల్సి ఉంటుంది. ఏదైతే మాత్రం ఏం నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లో కూడా ఎన్నాళ్ళని అదృష్టం పై ఆధారపడి ఇలా జీవితాలు నడుపుతామని కామెంట్లు పెడుతున్నారు.