28 ఏళ్ల యువకుడు 24 మంది అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన అసబుల్ మొల్లా తాజాగా సాగర్దిగీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని 24వ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె ఇంట్లో నగలు, డబ్బు తీసుకొని పరారయ్యాడు. గమనించిన యువతి సాగర్దిగీలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసబుల్ మొల్లా 24 పెళ్లిళ్లు బాగోతం బయటపడింది. మిగిలిన 23 మంది భార్యల ఇళ్లళ్లో కూడా డబ్బు, నగలు తీసుకొని పారిపోయాడు. తాజాగా 24 భార్య పోలీసులకు తెలుపగా అసలు విషయం తెలిసింది.