Viral : మూగజీవాలు మనుషులతో ఎంతగా కనెక్ట్ అవుతాయో అందరికీ తెలిసిందే అందుకే చాలామంది పెంపుడు జంతువులు ఇంట్లో మనుషుల్లానే చూస్తారు వాటికి ఏదైనా అయితే పోతారు అలాగే అవి కూడా ప్రతిసారి తన ప్రేమను ఆ మనిషి పైన చూపిస్తూనే ఉంటాయి తాజాగా ఇలాంటి ఓ సంఘటనే శ్రీలంకలో చోటుచేసుకుంది..
శ్రీలంక లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవకు చెందిన పీతాంబరం రాజన్ (56) అనే వ్యక్తి మంగళవారం అకస్మాత్తుగా మరణించాడు. అయితే బంధువులంతా అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు కడసారి వ్యక్తికి నివాళులర్పిస్తున్న సమయంలో అక్కడికి ఓ కొండముచ్చు వచ్చింది ఆ పరిస్థితుల్లో ఉన్న అతన్ని దీనంగా చూస్తూ తట్టి లేపేందుకు ప్రయత్నం చేసింది చాలాసేపు అటు ఇటు తిరుగుతూ అతనిని లేపేందుకు ప్రయత్నించగా ఎంతకీ సాధ్యం కాలేదు దీంతో అతను లేవడమే అర్థం చేసుకుని కన్నీరు కారుస్తూ అతనికి ముద్దు పెట్టింది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
పీతాంబరం రోజు ఆ కొండముచ్చుకు అన్నం పెట్టేవాడని అది కూడా రోజూ ఆ టైం కి వచ్చి అన్నం తిని కాసేపు అతనితో ఆడుకొని వెళ్లలేదని చుట్టూ ఉండే వాళ్లంతా తెలిపారు.. ఆ మూగ జీవిని ఆ స్థితిలో చూసిన వారందరికీ కళ్ళు చెమర్చాయి.. మూగజీవాలు మనుషులపై తమ గుండె విశ్వాసాన్ని మరొకసారి నిరూపించుకున్నాయంటూ చూసిన వాళ్లంతా కామెంట్లు పెడుతున్నారు..