FILM NEWS : అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతోన్నారు. నాగ శివ గారికి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు : అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, దర్శకత్వం : నాగ శివ, నిర్మాతలు : గణపర్తి నారాయణరావు, సహ నిర్మాతలు : తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు, పులగం సుప్రియ, లైన్ ప్రొడ్యూసర్ : పసుపులేటి సౌమ్య, నిర్మాణ సంస్థ : స్వయంభూ క్రియేషన్స్, సంగీతం : డేవ్ జాండ్, సినిమాటోగ్రఫీ : ఈశ్వర్, పీఆర్ఓ : ఫణి కుమార్ పులపర్తి

























