మీరు గురక పెడుతున్నారా? దానికి కారణమేంటో తెలుసా? గొంతు భాగంలో కొవ్వు ఎక్కువై గాలి వెళ్లే మార్గం చిన్నగా మారడంతోనే గురక వస్తుంది. వెల్లికిలా పడుకోవడం వల్ల గాలి తీసుకునే మార్గానికి అడ్డంకి ఏర్పడుతుంది. అలా అది గురకకి దారితీస్తుంది.
దీన్ని తగ్గించుకోవాలంటే మద్యం, సిగరెట్లు తాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నాలుక, గొంతు కండరాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వల్లే ముఖ్యంగా గురక వస్తుంది. పాటలు పాడటం.. నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.
సరిగా నిద్రపోకపోయినా గురక ఇబ్బంది పెట్టొచ్చు. పడుకునే ముందు ఆవిరి పట్టడం, వేడినీటితో స్నానం చేయడం వంటివి చేస్తే గురక తగ్గే అవకాశం ఉంటుంది.