movie టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయి దాదాపు ఏడాది కావోస్తోంది. ఈ విషయాన్నీ వారిద్దరు మర్చిపోయినా మిగిలిన వాళ్ళు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఇటు అభిమానులు అటు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం ఎంతో బాధ మిగిల్చింది. గతేడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. అయితే ఈ విషయంపై ప్రస్తుతం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.
‘ఇవి చాలా కాలం క్రితం నాటి జ్ఞాపకాలు. ప్రస్తుతం అవి లేవు. ఇకపై ఉండవు కూడా. కాబట్టి కొత్త కథ, కొత్త జీవితం మొదలు పెడదాం’ అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ కేవలం వారిద్దరి కోసం మాత్రమే అని తెలుస్తుంది. అయితే చై-సామ్ విడాకులు ప్రకటించిన అనంతరం ఆయన స్పందించారు. ఈ విషయం వినగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, ఒక్కసారిగా కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు ఆయన సలహా ఇచ్చినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరు విడిపోవడానికి ముఖ్యకారణం.. ఏమిటన్నది ఇంకా తెలియనప్పటికీ ‘ది ప్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో పాటు ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో సమంత రెచ్చిపోయి నటించడమే అని అభిమానులతో పాటు ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే నిజం ఏమిటన్నది ఎవరికి తెలియదు.

























