Devotional News : సకల సృష్టి లయకారుడు భోలాశంకరుడిని నిండు మనసుతో పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని అర్చకులు చెబుతూ ఉంటారు. శివయ్యను పూజించే వారికి కుటుంబ సమస్యలు తొలగిపోయి తమ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దేవతలకు అధిపతి అయిన దేవుడు మహా శివుడు. అయితే శ్రావణమాసం కార్తీక మాసం శివయ్యకు ప్రీతి మాసముగా చెప్పుకోవచ్చు. ఈ మాసాలలో ప్రతి సోమవారం శివయ్యకు స్వచ్ఛమైన మనస్సు పూజ చేయడం ద్వారా సకల లాభాలు చేకూరుతాయట. అయితే మహా శివుడికి ఏ విధంగా పూజ చేస్తే అనుగ్రహం వస్తుందో తెలుసుకుందాము..
ఆ కాశి విశ్వేశ్వరునికి నేలపై కూర్చొని ఎప్పుడూ పూజించకండి. శివుని ఆరాధనలో దర్భాసనాన్ని లో కూర్చుని శివుడిని పూజించండి . బోలా శంకరుడు నీ ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరంముఖంగా పూజించాలి.పూజా సమయంలో భస్మం ,రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి నుదుటిపై భస్మాన్ని మరియు రుద్రాక్షను ధరించండి పూజించడం మంచిదట.అలానే నువ్వులు, సంపంగి పువ్వులు తెల్లటి పువ్వులు, గంజాయి , బిల్వ పత్రం , జమ్మి ఆకులు మొదలైన వాటిని సమర్పించాలి. అలాగే అభిషేకంలో ఆవుపాలుతో అభిషేకం చేస్తే మ మంచిదట.
ఈ విధంగా శివయ్యకు పూజ చేయడం ద్వారా తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలానే ప్రతి సోమవారం శివయ్య మంత్రాలను జపిస్తూ ఆరోజు ఉపవాసం ఉంటే భక్తుల కోరుకున్న కోరికలు మరియు కుటుంబ సమస్యలు ఉన్న తొలగిపోతాయి. ఇది కేవలం దైవం పట్ల పెద్దవారు చెప్పిన మాటలు మాత్రమే.


























