Devotion news:తెలుగు సాంప్రదాయ ప్రకారం శ్రావణమాసం విశిష్ట మాసంగా చెప్పుకోవచ్చు. అనేక శుభకార్యాలు నాందిగా శ్రావణమాసాన్ని చెప్పుకోవచ్చు . అందులో భాగంగా శ్రావణమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగ పంచమి అంటారు. ఈ రోజున బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. నాగులచవితి మాదిరిగానే నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా అంత మంచి జరుగుతుందని తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే చాలామందికి నాగజాతి ఎలా జన్మించిందో అని ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది అయితే తెలుసుకోండి మరి ఆ కథా మీకోసమే..
కశ్యప ప్రజాపతికి, కద్రువ అనే దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, ననినాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించారు. అయితే వీరు కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దేవతలను దానితో కోటి దేవతలు బ్రహ్మ దేవుడిని వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురైన వారంతా నశిస్తారని శపించడం జరిగింది. అయితే మాకు శాపం తగునా అని అడగక…విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా అని అన్నారు బ్రహ్మదేవుడు.గరుడ మంత్రం చదివే వారి నుండి ఔషధ ముని సమేతులను నుంచి తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయు భక్షకులై సాధుజీవులుగా మారి మీరంతా అటవీ ప్రాంతాలలో పాతాళలలో నివాసం చేయండి అని బ్రహ్మ చెప్పగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.ఇలా భూలోకంలో నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు.


























