సంరక్షణ చూసుకునేవారు కరువయ్యారు , బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్
గతంలో ఆటో డ్రైవర్ గా పని చేసి, నాలుగేళ్ల క్రితం వచ్చిన పక్షవాతం వల్ల ఇంటికే పరిమితమయి ఇబ్బందులు పడుతున్న సంస్థాన్ నారాయణపురంకు చెందిన కిషన్ అనే బాధితుడి ఫిర్యాదును కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఛాంబర్ నుండి బయటికి వచ్చి పిటిషన్ స్వీకరించారు.
అనంతరం బాధితుడితో సాదరంగా మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. పక్షవాతం వల్ల ఇంటికే పరిమితమయిన తనను భార్య వదిలేసిందని, తన సంరక్షణ చూసుకునే వారు ఎవరూ లేకపోవడం చేత ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని సదరు బాధితుడు సీపీ కి తన బాధను వ్యక్తం చేశారు.
ఫిర్యాదు దారుడి భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వీలయినంత త్వరగా సమస్య పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సీపీ సూచించారు.