Movie డైరెక్టర్ మణిరత్నం కలల ప్రోజెక్ట్ పొన్నియన్ సెల్వం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాకు తమిళంలో కావలసినంత హైప్ క్రియేట్ అయినా తెలుగులో మాత్రం ప్రమోషన్స్ సరిగ్గా లేవని టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాటను తెలుగు ప్రేక్షకులు తెగ ట్రోల్స్ చేస్తున్నారు..
మణి రత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియన్ సెల్వం మూవీ నుంచి ఒక పాట విడుదలైంది. అయితే దీనికి తమిళంలో కావలసినంత క్రేజ్ వచ్చినా తెలుగు ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాటలో ఉన్న లిరిక్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని.. తమిళ యాసను ఉన్నది ఉన్నట్టు వాడేసారు అంటూ తెగ ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ పాట తెలుగు వెర్షన్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ ను అందించాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన పద ప్రయోగాలు మరీ వివాదాస్పదం అవుతున్నాయి.. ఒకప్పుడు మంచి పాటల రచయిత అంటూ పేరు దక్కించుకున్న అనంత శ్రీరామ్.. ప్రస్తుతం తెలుగు భాషను ఖూనీ చేస్తున్నారంటూ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.. ఈ సినిమాకు టాలీవుడ్ లో తగినంత బజ్ క్రియేట్ కాలేదని బాధపడుతున్న నిర్మాతలకు ఇలాంటి ట్రోల్స్ మరింత సమస్యగానే మారే అవకాశం ఉంది..
కోలీవుడ్ బాహుబలి అంటూ తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ మూవీకి తెలుగులో మాత్రం అంత సీన్ లేదు అంటున్నారు.. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, జయం రవి, త్రిష ప్రముఖ పాత్రలో నటించారు. తెలుగులో ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

























