Devotional News : హిందూ సాంప్రదాయం ప్రకారం ముందుగా తులసి చెట్టును పూజించి ఆ తర్వాత కార్యక్రమాలు నిర్వహిస్తారు. తులసి తోటకు కోటకు పూజ చేయడం ద్వారా ఇంట్లో ఉండే పీడంతా పోయి ఆ ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుందని ఒక నమ్మకం. కార్తీక మాసంలో తులసి పూజలో తమ మనసులోని మాట అమ్మవారికి చెప్పి పూజ చేస్తే ఆ పూజకి మంచి ఫలితం ఉంటుందని పురోహితులు చెబుతూ ఉంటారు. కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని స్మరిస్తూ ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో నిష్టగా పూజ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుందట. అటువంటి తులసి పూజను విశిష్టత తెలుసుకోండి మరి.
ఉదయాన్నే లేచిన వెంటనే తలస్నానం చేసి ఆ తర్వాత తులసి కోటను శుభ్రపరచుకోవాలి. అనంతరం తులసి కోటతో ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రాన్ని చెప్తూ ప్రదక్షిణను పూర్తి చేయాలి. ఆ తర్వాత పువ్వులను సమర్పించిన పిదప దీపారాధన చేయాలి. ఐదు రకాల నైవిద్యాలను పండ్లను తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ప్రతి కార్తీక సోమవారం రోజున ఈ పూజలు చేసుకుని ఆరోజు ఉపవాసం ఉండటం మంచిది.
కాగా కార్తీకశుద్ధ ఏకాదశిరోజు ముత్తైదులకు అరటికాయ తాంబూలం సమర్పించాలి ఇలా చేసిన అనంతరం తులసి అమ్మ వారిని లక్ష్మీనారాయణలను అర్చించుకోవాలి ఆరోజు రాత్రంతా కుటుంబం జాగరణ చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతంగా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు హిందూ సంప్రదాయ ప్రకారం ఇది ఒక నమ్మకం. అలానే ద్వాదశి రోజున తులసీ దేవికి బియ్యపు పిండితో మూడు ముద్దలను తయారుచేసి.. వాటిని నివేదించాలి. ఒకటి తులసి దేవి దగ్గర మరియు రెండోది బ్రాహ్మణుడికి చివరగా ముద్దలు రోటిలో ఉంచుకోవాలి. ఇలా కార్తీక మాసంలో చేయడం ద్వారా చేసిన పాపాలను నుంచి విముక్తి కలిగి, పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు వివరించడం జరిగింది.


























