అవును. మీరు విన్నది నిజమే. సీతమ్మ తల్లి పొరపాటు చేసింది. అయితే, పొరపాటు చేసింది త్రేతాయుగం నాటి సీతమ్మ తల్లి కాదు, కలియుగ సీతమ్మ. 80లలో దూరదర్శన్ చూసినవారందరికీ ఇప్పటికీ గుర్తుండిపోయిన ధారావాహికలలో ‘రామాయణ్’ అగ్ర భాగాన నిలుస్తుంది. శ్రీరాముడిగా అభినయించిన అరుణ్ గోవిల్, సీతమ్మగా నటించిన దీపికా చిఖ్లియా, లక్ష్మణుడికా కనిపించిన సునీల్ లహరి, భరతుడిగా నటించిన సంజయ్ జోగ్, ఆంజనేయుడిగా అలరించిన దారా సింగ్, రావణాసురుడిగా నటించిన అరవింద్ త్రివేది… ఇలా అందరూ వారి సొంత పేర్లతో సైతం ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. వారి అభినయం ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూంటుంది. ఇక మరో ప్రధానమైన విషయమేంటంటే కరోనా విజృంభించిన తొలి రోజుల్లో అందరూ ఇళ్లకే పరిమితమైన కారణంగా దూరదర్శన్ రామాయణాన్ని ప్రత్యేకంగా ప్రసారం చేసింది.
ఇకపోతే, ప్రస్తుత విషయానికొస్తే మనం మన దేశ స్వాతంత్ర్య 75వ సంవత్సర సంబరాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీపికా చిఖ్లియా తన అభిమానులకు భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మేసేజ్ ని పోస్ట్ చేశారు. కాకపోతే, ఆమె పాకిస్తాన్ పి.ఎం.ఓ.ని కూడా హాష్ టాగ్ చేశారు. ‘హ్యాప్పీ ఇండిపెండెన్స్ డే, పాకిస్తాన్ పి.ఎం.ఓ.’ అని చేశారు. అయితే, ఇక్కడ జరిగిన పొరపాటేంటంటే, పాకిస్తాన్ కూడా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న కారణంగా అది వారి దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్టయింది. దీంతో, ప్రముఖులు సైతం మండిపడ్డారు. అందుకే, సెలెబ్రిటీలు ఏదైనా పోస్టు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది.