Crime విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ చనిపోవడానికి రైలు పట్టాల మీదకు పరిగెట్టింది ఓ యువతి విషయం పసిగట్టిన ఆమె తండ్రి కాపాడటానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు తండ్రి కుమార్తె మరణంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది…
విజయనగరం ఎస్సై రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు విజయనగరం జిల్లాలో గజపతినగరం లింగాలవలసకు చెందిన వారీగా గుర్తించారు.. వీరు మధుపాడు లో తమ బంధువుల ఇంటికి వచ్చిన తవుడు అనే వ్యక్తి ఆయన తన కుమార్తెను తీసుకొని బైక్ పై వెళ్తున్నాడు ఇంతలో స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేటప్పటికి మతిస్థిమితం సరిగా లేని ఆ అమ్మాయి వెంటనే దగ్గర రైల్వే ట్రాక్ పైన పరిగెత్తటం మొదలుపెట్టింది.. అయితే ఇంతలో ఆ విషయం గమనించిన ఆమె తండ్రి వెంటనే వెనుక పరిగెత్తాడు.. ఇంతలో ఓ ట్రైన్ అటువైపు రావడంతో తండ్రి కుమార్తె ఇద్దరినీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..
అయితే ఈ ప్రమాదంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అనుకున్నాయి తవుడుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. ఇందులో కుమార్తె ఇప్పుడు చనిపోవడంతో ఆయన భార్యకుమార్తతో పాటు అతని తల్లి తండ్రి కూడా దిక్కులేని వాళ్ళు అయ్యారు.. తన కొడుకు ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదని అంతేకాకుండా ఆర్థికంగా కూడా తమకు ఎలాంటి బాధలు లేవని కానీ ఇలా జరగటం తమను ఎంతో షాక్కు గురి చేసిందని మృతుడి తండ్రి తెలిపారు.. తవుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిస్తున్నట్టు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు..