Crime దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుని అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు చేసుకుంటున్నా మనదేశంలో కొన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం స్వతంత్రం రాలేదు.. ఇప్పటికి కొన్ని ప్రాంతాల ప్రజలు మనసులో దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళతో జీవితాన్ని నెట్టుకు వస్తున్నారు ఇలాంటి ఓ సంఘటనే ప్రస్తుతం అందరిని కలిచి వేస్తోంది
మధ్యప్రదేశ్లో జరిగిన ఓ హృదయవిదారక ఘటన ప్రస్తుతం మనదేశంలోని ఓ పేదవాడి పరిస్థితి ఎలా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది… ఆస్పత్రిలో చనిపోయిన ఓ నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహనం లేక సాధారణ ప్రయాణికుల మాదిరిగానే బస్సులో వచ్చి కూర్చొని ప్రయాణం చేయటం ఈ విషయం చూసిన వారందరినీ ఆవేదనకు గురిచేస్తుంది.. ఇలా వెళ్తున్న వ్యక్తిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం మీ ఫోటోలు వైరల్ గా మారాయి దేశ ప్రగతి అంటే ఇదేనా అంటూ ఇది చూసిన వాళ్లంతా కామెంట్లు పెడుతున్నారు..
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఛాతర్పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ చనిపోయింది.. దాంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఛాతర్పుర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోస్ట్మార్టం అనంతరం గ్రామానికి మృతదేహాన్ని తరలించే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి మృతదేహాన్ని తరలించేందుకు అక్కడ ఆసుపత్రికి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి వాహనం లేకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది పోనీ ఏదైనా ప్రైవేటు వాహనంలో తీసుకుపోదామంటే సరిపడే డబ్బులు లేక ఆ బాలిక మృతదేహాన్ని భుజాలపై వేసుకుంటూ అలానే నడుచుకుంటూ వచ్చి బస్సులో కూర్చుని తోటి ప్రయాణికులతో పాటు ప్రయాణించాడు… అయితే మారుమూల ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు లేవని ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగాయి అంటూ గ్రామస్తులు వాపోతున్నారు…