Movie News: ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన కొండ పొలం ఆశించినంత విజయం చేకూర్చలేకపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు “రంగ రంగ వైభవంగా” అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మెగా బుల్లోడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మ కూడా సూపర్ హిట్ లేదనే చెప్పుకోవాలి. ఈ సినిమా అయినా ఇద్దరి కెరియర్ మారుస్తుందో లేదో.
గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. వచ్చే నెల (సెప్టెంబర్) 2న ఈ చిత్రం విడుదల సిద్ధమైనది. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ని విడుద చేశారు చిత్ర బృందం.
విడుదల చేసిన ట్రైలర్లు ప్రకారం చిన్నప్పటి నుంచి గొడవ పడుతూ ఉంటారు హీరో హీరోయిన్. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి ఏర్పడుతుంది ఈ తరుణంలోనే కుటుంబంలోని సమస్యలు ఏర్పడడం జరుగుతుంది ఈ తరహాలో ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే చివరగా వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్ మాత్రం ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పుకోవాలి అదేమిటంటే “నాన్న ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుండి ఇంకో లెక్క చెప్పను చూపిస్తా ను”. అంటూ ట్రైలర్ ముగించడం జరిగింది. చూడాలి మరి ఈ చిత్రమైన వైష్ణవ్ తేజ్ కి కేతిక శర్మ వీరిద్దరి సినీ కెరియర్ని మారుస్తుందో.