Telugu World Now
No Result
View All Result
Tuesday, June 24, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Film News

FILM REVIEW : 23 (ఇరవై మూడు) మూవీ రివ్యూ రేటింగ్ – Rating : 3.5/5

23 Iravai Moodu Movie Review and rating, Telugu Movie Reviews, Film News

Sowmya by Sowmya
May 17, 2025
in Movie Reviews
23 Iravai Moodu Movie Review and rating, Teja, Tanmai Khushi, Teja, Jhansi, Director Raj R, Film Reviews, Latest Telugu Movies, Telugu World Now

LATEST TELUGU MOVIES : మల్లేశం, 8:00 A.M. మెట్రో వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ రాచకొండ దర్శకత్వంలో “23” అనే సినిమా రూపొందింది. వాస్తవానికి చరిత్రలో సంచలనానికి కేంద్ర బిందువులుగా మారిన చుండూరు ఘటనతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీరాములయ్య సినిమా షూటింగ్ బాంబ్ బ్లాస్ట్ కేసులతో పోల్చుకుంటూ, చిలకలూరిపేట బస్సు దహన కేసు నిందితుల శిక్ష వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నట్టు ప్రచార కంటెంట్‌తోనే స్పష్టత వచ్చేసింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోయినా, మల్లేశం వంటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఆ ఆసక్తిని సినిమా దర్శకుడు ఎంతవరకు సినిమాతో నిలబెట్టుకోగలిగాడు అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

నటీనటులు : సాగర్ అనే పాత్రలో తేజ ఇమిడిపోయాడు. నిజంగా ఇతనే ఆ తప్పు చేసి ఇంత మథనపడుతున్నాడా అనిపించేలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. లాంచింగ్‌లో ఇలాంటి సవాలుతో కూడిన సబ్జెక్ట్ తీసుకోవడంతోనే తేజ సఫలమయ్యాడేమో అనిపిస్తుంది. ఇక సుశీల పాత్రలో తన్మయ ఒదిగిపోయింది. ఆమె కాకుండా ఇంకెవరూ అంతలా నటించలేరేమో అనిపించేలా ఆమె పాత్ర బాగుంది. పవన్, రమేష్, తాగుబోతు రమేష్, ఝాన్సీ, వేదవ్యాస్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఇక టెక్నికల్ పరంగా సినిమాకి టెక్నికల్ అంశాలన్నీ బాగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీతో పాటు ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు చాలా బాగా కనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇంకా బలమైన భావోద్వేగాలు ఉంటే ప్రేక్షకులు మరింత బాగా కనెక్ట్ అయ్యేవారేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

23 కథ : నిజానికి ఇది నిజ జీవిత ఘటనే అయినా, దాని ఆధారంగా కాస్త సినిమాటిక్ టచ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), రెల్లి కుటుంబానికి చెందిన సుశీల (తన్మయ) ప్రేమించుకుంటారు. పెళ్లి కాకముందే సుశీల గర్భవతి అవుతుంది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు సాగర్. ఇడ్లీ సెంటర్ పెట్టుకుని ఊరిలో గౌరవంగా బతకాలని భావించే సాగర్‌కు అప్పు దొరకక, చివరికి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాశ కారణంగా తన స్నేహితుడు దాస్ (పవన్ రమేష్‌)లతో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు. నక్సలైట్ల పేరుతో బస్సు దోపిడీ చేయాలని ప్లాన్ చేసి వెళ్తే, ఆ బస్సు దహన సంఘటనలో 23 మంది మరణానికి కారణమవుతారు. ఈ కేసులో కోర్టు వారికి మరణశిక్ష విధిస్తుంది. ఆ తర్వాత వారు మరణశిక్ష నుంచి యావజ్జీవ ఖైదీలుగా ఎలా మారారు? వారిని కాపాడేందుకు ఎవరెవరు ప్రయత్నించారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

విశ్లేషణ : నిజానికి మల్లేశం సినిమా డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందని అందరిలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. బహుశా నాకు కూడా మల్లేశం వ్యక్తిగతంగా నచ్చడంతో, ఈ డైరెక్టర్ ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురుచూశాను. అలాంటి సమయంలోనే 8:00 A.M. మెట్రో అనే సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అదే డైరెక్టర్ “23” అనే సినిమా చేస్తున్నాడని తెలిసి, ఇది ఎలాంటి కంటెంట్‌తో ఉండబోతుందా అని అనుకున్నాను. కానీ ప్రచార కంటెంట్ చూస్తే ఇదేదో ప్రచారాత్మక ఫిల్మ్ అనే భావన కలిగింది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినా ఇంకా దళితులను ఇబ్బంది పెడుతున్నారు లేదా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారు అనే ప్రచారం కొంతమంది కావాలనే చేస్తూ ఉంటారు. ఈ ప్రచార కంటెంట్ చూసిన తర్వాత ఎందుకో అలాంటి భావన కలిగింది. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అది పూర్తిగా మారిపోయింది.

నిజానికి ఇక్కడ దర్శకుడు లేవనెత్తిన అంశం నిజంగా చర్చనీయమైనది. చిలకలూరిపేట బస్సు దహన కేసులో ఇద్దరికి శిక్ష పడింది. నిజానికి ఈ ఇద్దరు బస్సులో ఉన్న ప్రయాణికుల నుంచి డబ్బు దోచుకోవడానికి వెళ్లారు, కానీ వారిని చంపడానికి కాదు. వారిని భయపెట్టడానికి పెట్రోల్ పోస్తే అది 23 మంది దహనానికి కారణమైంది. అగ్గిపుల్ల వెలిగించింది ఎవరు అనే విషయాన్ని పక్కనపెడితే, వీరు దోపిడీ చేయడానికి వెళ్లారు, కానీ అది 23 మంది సజీవ దహనానికి కారణమైంది. అయితే, మరో రెండు కేసులు—ఒకపక్క చుండూరు, మరోపక్క జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసు—ఈ రెండింటిలో నిందితులకు స్పష్టమైన ఉద్దేశం ఉంది. కచ్చితంగా అవతలి వ్యక్తులను చంపడానికే వీరు బయలుదేరారు, చంపారు, అందులో విజయం సాధించారు.

కానీ వారు తమకున్న పలుకుబడితో, డబ్బు బలంతో, సత్ప్రవర్తన పేరుతో రకరకాల ప్రలోభాలకు గురిచేసి బయటకు వచ్చేశారు. కానీ, తెలియక 23 మంది ప్రాణాలకు కారణమైన ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రం ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు. ఈ విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా ప్రశ్నించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా, జైలు సంస్కరణల గురించి కూడా సినిమాలో చర్చించిన విషయం బాగుంది. నిజానికి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ఖైదీల ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు, జైళ్లు నేరాలు నేర్చుకోవడానికి అడ్డాలుగా మారుతున్నాయా అని అనుమానం కలగకమానదు. కానీ, బినా ప్రొఫెసర్ వంటివారు వారి ఉన్నతికి ఎంతగా కష్టపడుతున్నారు అనే విషయాన్ని చూపించిన విధానం బాగుంది.

Related Posts

'Drinker Sai' hero Dharma's Performance is being praised by audiences, Director Kiran Tirumalasetty, Film News, Latest Telugu Movies, Telugu World Now
Movie Reviews

FILM NEWS : డ్రింకర్ సాయి హీరో ధర్మ పర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా

December 29, 2024
Entertainment

మెసేజ్ ఓరియెంటెడ్ “ఐడెంటిటీ’ మూవీ రివ్యూ

May 13, 2024
Entertainment

‘కాంతార’ కన్నా ముందు వచ్చిన ‘పింగార’ గురించి మీకు తెలుసా ?

May 13, 2024

Movie : ఓరి దేవుడా చిత్రం… మినీ రివ్యూ..

May 13, 2024
Movie : 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్లో మూవీ.. మరో దళపతి కానుందా..

Movie : 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్లో మూవీ.. మరో దళపతి కానుందా..

May 13, 2024
Movie బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే క్యాన్సిల్ అయిందా…అన్ని కోట్లు నష్టమైతే ఎలా?

Movie review భారీ అంచనాల నడుమ విడుదలైన బ్రహ్మాస్త్ర మూవీ గురించి అభిమానులు ఏమంటున్నారంటే.. !

May 13, 2024
Die Heart Fan Movie Review, Heroine Priyanka Sharma, Shiva Alapati, Rajeev Kanakala, Abhiram M,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments,Telugu World News
Entertainment

రాత్రి పూట స్టార్ హీరోయిన్ ‘డై హార్డ్ ఫ్యాన్’ శివ ఇంటికి రావడానికి కారణమేంటి ?

May 13, 2024
Maatarani Mounamidi Movie Review, Mahesh Datta, Sony Srivastava, Telugu Movie Reviews,Latest Telugu Movies,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments
Movie Reviews

మాటరాని మౌనమిది మూవీ రివ్యూ

May 13, 2024
Crush Movie Hero Abhaya Simha Commitment Movie Review, Tejaswi Madivada , Amit Tiwari , Ramya Pasupuleti , Surya Sreenivas,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments
Movie Reviews

క్రష్ మూవీ హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ రివ్యూ

May 13, 2024
Action Thriller Entertainer Rechipodam Brother Movie Review,Atul Kulkarni,Deepali Sharma,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments
Entertainment

యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ “రెచ్చిపోదాం బ్రదర్” మూవీ రివ్యూ

May 11, 2024
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025
Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

June 19, 2025
Solo Boy Trailer Launch, Director P Naveen Kumar, Gautham krishna , Shweta Avasthi, Latest Telugu Movies, Telugu World Now

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన గౌతమ్ కృష్ణ

June 19, 2025
Celebrating the 50th birthday of renowned music director late Chakri garu in line with his aspirations, Latest News, Telugu World Now

ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు

June 15, 2025
Colour Photo Team Receives Gaddar Award from CM Revanth Reddy for Being the Second Best Film of 2020, Latest Telugu News, Telugu World Now

FILM NEWS : 2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’

June 15, 2025
Phanindra Narsetti & Ananthika Sunilkumar's '8 Vasanthalu' Visually Poetic, Heart Touching Trailer Released, Latest Telugu Movies, Telugu World Now

Latest Telugu Movies : ‘8 వసంతాలు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్

June 15, 2025
‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

June 14, 2025
Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

June 14, 2025
Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్

Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్

June 13, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

 

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

WhatsApp us