300 Bed Covid Isolation Centre at Calvery Temple inaugurated by MLC Kavitha in Association with Ankura Hospital and St Theresa Hospital,Corona Upadtes,
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అంకురా హాస్పిటల్, థెరిస్సా హాస్పిటల్ ల సౌజన్యంతో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
రాష్ట్రంలో కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ సెంటర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అంకురా హాస్పిటల్, థెరిస్సా హాస్పిటల్ ల సౌజన్యంతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కరోనా పేషెంట్లకు చికిత్స, మందులు, నాణ్యమైన భోజనం సహా అన్నీ ఉచితంగానే అందించనున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, సానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బెడ్ లు అందుబాటులో ఉంచడంతో పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్ లకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత
కరోనా పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తున్న బ్రదర్ సతీష్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సోమవారం నుండి ఇక్కడ కోవిడ్ పెషెంట్లకు చికిత్స అందించనున్నారు. నిత్యం 100 కు పైగా వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో సేవలందించనున్నారు. 300 పడకల ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో, 50 ఆక్సిజన్ బెడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MLC Kavitha inaugurates 300 bedded COVID Isolation Centre at Calvary Temple for the needy
Kavitha launches Calvary Temple Covid Isolation Centre in association with Anukura Hospital and Theresa Hospital