Crime దసరా సెలవుల్లో విషాదం నెలకొంది సెలవులు కానీ ఇంటికి వెళ్ళిన ఏడుగురు పిల్లలు సముద్రంలో మునిగి పోయారు.. విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ జిల్లా బాపట్ల దగ్గరలో సూర్యలంక బీచ్ లో జరిగింది..
దసరా సెలవులు కానీ ఇంటికి వెళ్ళిన పిల్లలకు విషాదమే మిగిలింది.. సెలవులు కదా అని ఇంటికి వెళ్లిన ఏడుగురు పిల్లలు సరదాగా బీచ్ కి వెళ్లారు వీరంతా విజయవాడకు చెందినవారే అయితే ఆకస్మాత్తుగా అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయారు.. పిల్లలు గల్లంతయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. గాలింపు చర్యలు మొదలుపెట్టగా వీరిలో ముగ్గురు చనిపోగా.. ఇద్దరిని సహాయక బృందం కాపాడింది…. మృతులను విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు. ఫణి, రాఘవ, ప్రభు దాసు ఆచుకీ ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
అయితే వీళ్ళంతా ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్న పిల్లలని పోలీసులు తెలిపారు. దసరా సెలవులకు ఊరు వచ్చిన వీరంతా ఉదయం వీరంతా ట్రెైన్‌లో బాపట్లకు చేరారు. అక్కడ నుంచి ఆటోలో సూర్యలంకకు వెళ్లామని క్షేమంగా బయటకు వచ్చిన ఓ బాలుడు తెలిపారు. పండక్కి వచ్చిన పిల్లలు ఇలా గల్లంతవ్వడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి..